ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సందర్భంలో పౌలు విత్తనాన్నీ దానినుండి వచ్చే మొలకనూ ఉపమానంగా పేర్కొన్నాడు. విత్తనానికి సంబంధించిన మొలకే మొలుస్తుంది. మామిడి విత్తనంనుండి నారింజ మొలకరాదు కాని విత్తనం రూపంవేరు, మొలకరూపం వేరు. మన లౌకిక దేహాలు విత్తనాలు. మన ఉత్థాన దేహాలు వాటినుండి వచ్చే మొలకలు -1 కొరి 15, 44.

ఫలితార్థం ఏమిటంటే, మన ఆత్మలు శరీరాలు కూడ ఉత్థాన జీవితంలో వుంటాయి. కాని అక్కడి శరీరాలు ఇక్కడి వాటిల్లాగ క్షయమైనవి కావు, అక్షయమైనవి. భౌతికమైనవి కావు, దివ్యమైనవి.

పౌలు త్వరగా చనిపోయి క్రీస్తుని చేరుకోవాలని ఉవ్విళూరి పోయాడు. అతనికి తన విశ్వాసుల అవసరాలు తీర్చడం కొరకు తాను ఇంకా కొంతకాలం జీవించివుండడం మేలనిపించింది. కాని తనమటుకుతాను ఈ జీవితాన్ని త్యజించి క్రీస్తుని చేరాలనిగాఢంగా వాంఛించాడు -ఫిలి 1,23-25. ఇంకా తాను ఈ భౌతిక శరీరాన్ని త్యజించి క్రీస్తు సన్నిధిని చేరడమే మేలని యెంచాడు -2కొరి 5,8. క్రీస్తుపట్ల అతనికున్న గాఢమైన ప్రేమ ఆలాంటిది.అతని దృష్టిలో నరునిగమ్యం క్రీస్తే. రెండవ రాకడ అంటే ప్రధానంగా మనం క్రీస్తుని చేరుకొని అతనితో సదావుండి పోవడవేు. ఈలోకంలో మనం పయనించే బాట మనలను ఆ క్రీస్తువైపే తీసికొనిపోవాలి. అది మనలను ఆ క్రీస్తు దగ్గరికే చేర్చాలి. మనం చేరవలసిన రేవు క్రీస్తే.

ఉపసంహారం

తండ్రి క్రీస్తుద్వారా మనకు నూత్న జీవాన్ని ఈయగోరాడు. మనం ఈ క్రీస్తుని విశ్వసించి రక్షణం పొందాలి. క్రీస్తు వరప్రసాదం