ఈ పుట ఆమోదించబడ్డది

30 ఏండ్ల పాటు సుదీర్ఘమైన ప్రేషిత సేవచేసి నీరో చక్రవర్తి కాలంలో వేదసాక్షిగా మరణించాడు.

పౌలు కాలపట్టిక

 జననం -క్రీ.శ. 10
పరివర్తనం - 36.
తార్సులో - 45
అంతియొకయలో - 47
మొదటి ప్రేషితయాత్ర - 47-49.
యెరూషలేము మహాసభ - 49.
రెండవ ప్రేషితయాత్ర 49-52.
మూడవ ప్రేషితయాత్ర 54-57
యెరూషలేములో ఖైదీ గావడం - 58
సీజరియాలో ఖైదీ 58-60
రోముకు ప్రయాణం - 60
రోములో ఖైదీ 61-63
వేదసాక్షి మరణం - 67.

2. పౌలు బోధలకు ఆధారాలు

పౌలు బోధలకు మూడు ప్రధానమైన ఆధారాలు వున్నాయి. మొదటిది, అతడు యూదరబ్బయి. కనుక పూర్వవేదంనుండి చాల భావాలు స్వీకరించాడు. దైవకారుణ్యం, పాపపరిహారం, పరలోకంలో శిక్షా బహుమతులు, ఉత్థానం, దేవదూతలు మొదలైన భావాలను పూర్వవేదంనుండే గ్రహించాడు. రెండవది, అతనికి క్రీస్తు బోధలు తెలుసు. తొలినాటి ప్రేషితుల బోధలు, వారి సంప్రదాయాలు కూడా తెలుసు. ఇవికూడ అతని రచనలకు ఆధారమయ్యాయి.