ఈ పుట ఆమోదించబడ్డది

నుగా జేసాడు. యూదులు పౌలుని ఎదిరించారు. కాని క్రీస్తు తన దర్శనాలతో అతనికి ధైర్యంచెప్పాడు. మొట్టమొదటిసారిగా యూరపులో వేదభోధ జరిగింది ఈ యాత్రలోనే. మూడవ ప్రేషితయాత్ర 54-57 సంవత్సరాల్లో జరిగింది. ఈ సారి పౌలు ప్రధానంగా ఎఫెసు పట్టణంలో వేదజోధ చేసాడు. అక్కడే మూడేండ్లు వున్నాడు. తిరుగు ప్రయాణంలో తాను పూర్వం స్థాపించిన క్రైస్తవ సమాజాలను బలపరచాడు. మిలేతు వద్ద ఎఫెసు సమాజం పెద్దలను కలిసికొని వారికి ధైర్యం చెప్పాడు.

చెరసాల, మరణం

యెరూషలేము యూదులు దేవాలయ సందర్శనానికి వచ్చిన పౌలుపై దౌర్జన్యం చేసారు. రోమను పాలకులు అతన్ని బందీని చేసి సీజరియాకు పంపారు. అక్కడ గవర్నరు ఫీలిక్సు అతన్ని రెండేండ్లు చెరలో వుంచాడు. తర్వాత వచ్చిన గవర్నరు ఫెస్తు అతన్ని రోముకి ఖైదీగా పంపాడు. దారిలో మాల్చావద్ద పౌలు ప్రయాణం చేస్తున్న వోడ తుఫానుకి చిక్కి నాశమైంది. పౌలు రోముకి చేరుకొని రెండేడ్లు చెరలో ఖైదీగా వున్నాడు. ఆ కాలంలో రోములోని యూదులకు క్రీస్తుని బోధించాడు. ఇంతటితో అపోస్తుల చర్యల గ్రంథం ముగుస్తుంది. ఆ పిమ్మట పౌలుకి ఏం జరిగింది మనకు రూఢిగా తెలియదు.

ఓ ప్రాచీన సంప్రదాయం ప్రకారం పౌలుకి రోము చెరనుండి విముక్తి లభించింది. అతడు స్పెయినుకు వెళ్లి అక్కడే వేదబోధ చేసాడు. తీమోతిని క్రీటుకు, తిమోతిని ఎఫెసుకు పెద్దలనుగా నియమించాడు. ఆ పిమ్మట పాలుని మళ్లా బంధించి రోములో చెరలో పెట్టారు. అక్కడే అతన్ని 67 ప్రాంతంలో వధించారు. అతడు