ఈ పుట ఆమోదించబడ్డది
3. శరీరం నుండి స్వేచ్ఛ

ఇక్కడ శరీరం అంటే శారీరక వాంఛలు. మనం జ్ఞానస్నానం ద్వారా క్రీస్తుతో ఐక్యమైనపుడు అతని ఆత్మ మనలో వసిస్తుంది. దానివలన శరీరం మన అదుపులోకి వస్తుంది. -రోమా 7,5. మనం ఆత్మానుసారంగా జీవిస్తాం. ఆత్మమనలను నడిపిస్తుంది. మనం క్రీస్తు విూద ఆధారపడి జీవిస్తాం. అతనికి లొంగివుంటాం. అతని అడుగు జాడల్లో నడుస్తాం.

బాహిరమైన నియమాలు కూడ అవసరం

క్రైస్తవుణ్ణి ఆంతరంగికంగా ఆత్మే నడిపిస్తుంది. అతడు ఆత్మానుసారంగా జీవిస్తాడు. ఐనా అతడు నూత్నవేదకాలంలో గూడ కొన్ని నియమాలు ఆజ్ఞలు పాటించాలి. ఎందుకు? ఆత్మ మనలను నడిపించినా మనం ఆత్మకు పూర్తిగా వశులంగాము. శరీరం మనలను ఈలోక వస్తువుల వైపు లాగుతుంటుంది. మనలో శరీరం ఆత్మ నిత్యం ఘర్షణ పడుతుంటాయి. శరీరం కోరేది ఆత్మకోరేదానికి విరుద్ధం గాను, ఆత్మకోరేది శరీరం కోరేదానికి విరుద్ధం గాను వుంటాయి. ఈ రెండిటికి బద్ధవైరం. అందువలన మినారు చేయగోరిన దానిని చేయలేకున్నారు -గల 5,17. ఫలితంగా నరుడు దేవుణ్ణి విడనాడి లోకాశల్లో పడిపోతుంటాడు. అందుచే మనకు కూడ కొన్ని వెలుపలి ఆజ్ఞలు అవసరమే. రోజువారి జీవితంలో ఇవి మనం దేవుని చెంతకు తిరిగిరావడానికి ఉపయోగపడతాయి.

ఉత్థాన క్రీస్తు మనలను ఆంతరంగీకంగా నడిపించాలి. క్రీస్తు నియమాలు మనలను బాహిరంగా నడిపించాలి. క్రీస్తు అతని జీవితమూ బోధలూ మనకు ఆదర్శం కావాలి. నాకు జీవించడమంటే క్రీస్తుని జీవించడమే -ఫిలి 1,21. మనకు నియమాలంటే ప్రధానంగా క్రీస్తే.