ఈ పుట ఆమోదించబడ్డది
1. ధర్మ శాస్త్రం నుండి స్వేచ్ఛ

యూదులకు మోషే 613 ఆజ్ఞలతో గూడిన ధర్మ శాస్తాన్ని యిచ్చాడు. ఈ యాజ్ఞలకు రబ్బయులు మరికొన్నిటిని చేర్చారు. వీటికి పితరుల సంప్రదాయాలు అని పేరు. ఇవన్నీ కలసి చాల ఆజ్ఞలు అయ్యాయి. ఈ బాహిరమైన ఆజ్ఞలన్నీ పాటిస్తే యూదులకు రక్షణం, లేకపోతే నరకం అన్నారు. యూదులు తమకు ఇష్టం లేకపోయినా బానిసల్లాగ ఈ బాహిరమైన ఆజ్ఞలను పాటించాలి. ఈలా పాటించడంవల్ల వాళ్లు నిజంగానే బానిసల్లాగ తయారయ్యారు. కాని ఆంతరంగికమైన ప్రేరణంవల్ల ప్రేమభావంతో ఇష్టపూర్తిగా ఆజ్ఞలు పాటించేవాడు స్వేచ్ఛాపరుడు.

ధర్మశాస్రం వలన రక్షణం కలిగితే నరుడు తన పుణ్య క్రియలద్వారా తన్నుతానే రక్షించుకొన్నటు. కాని నరులను రక్షించేది క్రీస్తు సిలువమరణం వలన కలిగిన వరప్రసాదం. నరుడు క్రీస్తుని విశ్వసించి ఈ వరప్రసాదాన్ని పొంది దానిద్వారా రక్షణానికి పాత్రుడు ఔతాడు. కనుక ధర్మశాస్రంతో అతనికి అవసరం లేదు. అతడు దానికి బానిస కానక్కరలేదు. ఇది పౌలు బోధ.

2. పాపంనుండి స్వేచ్ఛ

క్రీస్తు తన సిలువమరణం ద్వారా పాపానికి చనిపోయాడు. అనగా అతని మరణం ద్వారా పాపం శాశ్వతంగా అంతరించింది -రోమా 6,10. మనం ఈ క్రీస్తు లోనికి జ్ఞానస్నానం పొందుతాం. అతని వురణం వున విూద సోకి వున కు పావ వ రిహారం చేసిపెడుతుంది. మన పాపాలకొరకు అతడు మరణించాడు. మనలను నీతిమంతులను చేయడానికి మరల లేవనెత్త బడ్డాడురోమా 4,25. క్రీస్తు మరణం మనలను పాపం నుండి విముక్తులను చేస్తుంది. ఈలా మనకు పాపుస్తుడి స్వేచ్ఛ లభిస్తుంది.