ఈ పుట ఆమోదించబడ్డది

3. సత్ర్పసాద స్వీకరణం క్రీస్తు రెండవ రాకడను గూడ జ్ఞప్తికి తెస్తుంది. ప్రభువు మరల వచ్చే వరకు అతని మరణాన్ని ప్రకటిస్తాం -26. రెండవ రాకడవల్లగాని మన రక్షణం పరిపూర్ణం కాదు. అందుకే తిరుసభ ప్రభూ రండి అని వేడుకొంటుంది- 1 కొరి 16,22. అతని రెండవరాకడకొరకు వేచివుంటుంది.

8.క్రైస్తవుడు - స్వేచ్ఛ

పౌలు పలుసారు క్రైస్తవుడు స్వేచ్ఛగా జీవించాలని చెప్తుంటాడు. స్వతంత్రులుగా జీవించడానికి క్రీస్తు మనకు విముక్తిని దయచేసాడు. కనుక దృఢంగా నిలవండి. మినారు మరల దాస్యమనే కాడికి లొంగవదు - గల 5,6.

గలతీయుల జాబులో ఈ స్వాతంత్ర్యం అనే భావం ఎక్కువగా వస్తుంది. గలతీయ క్రైస్తవులు గ్రీకులు. పౌలే వీరికి క్రీస్తుని బోధించాడు. క్రీస్తు మరణోత్థానాలు మనలను రక్షించాయనీ, ఇప్పడు క్రీస్తుని విశ్వసించి అతని వరప్రసాదం ద్వారా మనం రక్షణం పొందాలనీ బోధించాడు. కాని తర్వాత యూదమతాభిమానులు ఈ ప్రజల దగ్గరికి వచ్చి ధర్మశాస్తాన్ని పాటిస్తేనేగాని మినారు రక్షణం పొందరని బోధించారు.

పౌలు వారి వాదాన్ని ఖండించి క్రీస్తు వరప్రసాదం వొక్కటే మనకు రక్షణను ప్రసాదిస్తుందని నొక్కిచెప్పాడు. క్రీస్తుని విశ్వసించి మనం రక్షణం పొందాలని నుడివాడు. ధర్మశాస్త్రం మనలను రక్షిస్తే క్రీస్తు సిలువమరణం నిప్ర్పయోజన మౌతుందని తెలియజేసాడు. క్రైస్తవునికి స్వేచ్ఛ వుండాలని వాదించాడు. ఈ స్వేచ్ఛ మూడు విధాలుగా వుంటుంది.