ఈ పుట ఆమోదించబడ్డది

5. సత్రసాదం పౌలు దివ్యసత్ర్పసాద స్థాపనను -1కొరి 11,23–27 లో వర్ణించాడు. ఈ భాగం సువిశేషాల్లోని సత్ర్పసాద స్థాపన భాగాలకంటె ప్రాచీనమైంది. కనుక దీనికి విలువ యొక్కువ. పౌలు దృష్టిలో నత్ర్పసాదం ప్రధానంగా ప్రభువు రాత్రిభోజనం -11.20.భక్తులు దీన్ని ఆధ్యాత్మికమైన భోజనంగాను పానీయంగాను స్వీకరించాలి. ఇది పూర్వవేదంలోని సీనాయి నిబంధనను జ్ఞప్తికి తెస్తుంది. ఈ భోజనం మనలను క్రీస్తుతో ఐక్యంజేస్తుంది. మనలను పరస్పరం ఐక్యంజేస్తుంది. ఒకే రొట్టెను భుజించిన వాళ్లు ఒక్క శరీరం, ఒక్కవ్యక్తి ఔతారు -1 కొరి 10,17. ఇంకా యిది క్రీస్తు మరణాన్ని జ్ఞప్తికి తెస్తుంది. అతని రెండవ రాకడ కొరకు భక్తిభావంతో వేచివుండేలా చేస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా మూడంశాలను గమనించాలి -1. సత్ర్పసాదం క్రీసు సాన్నిధ్యాన్ని తెలియజేస్తుంది. అతడు అప్పరసాల రూపంలో ఇప్పడు మన మధ్య నెలకొని వుంటాడని తెల్పుతుంది. ఎవడైన అయోగ్యంగా ప్రభువు రొట్టెను భుజించి అతని రక్తాన్ని పానం జేస్తే ప్రభువు శరీరరక్తాలకు వ్యతిరేకంగా పాపం జేసినట్లే -1127. దీన్ని బట్టి అప్పరసాల్లో ప్రభువు సాన్నిధ్యం వుందని భావించాలి కదా! 2. మనం ఈ రొట్టెను రసాన్ని స్వీకరించినపుడెల్ల ప్రభువు మరణాన్ని ప్రకటిస్తాం. ఎవరికి ప్రకటిస్తాం? భక్త సమాజంలో ఒకరి కొకరం ప్రకటించుకొంటాం. ఇంకా, ఈ సత్ర్పసాద స్వీకరణం ప్రభువు జ్ఞాపకార్థం చేసేది -24. అనగా మనం తండ్రికి క్రీస్తుమరణాన్ని జ్ఞాపకం చేస్తాం. తన కుమారుని మరణాన్నిజూచి తండ్రి మన పాపాలను క్షమిస్తాడు.