ఈ పుట ఆమోదించబడ్డది

పవిత్రాత్మ మన మందరం ఒకే ఆత్మయందు, ఒకే శరీరంగా జ్ఞానస్నానం పొందాం - 1 కొరి 12,13. పౌలు క్రీస్తు జ్ఞానశరీరానికి శిరస్సు అని చెప్పాడు. ప్రతి పురుషుని శిరస్సు క్రీస్తు. స్త్రీకి శిరస్సు భర్త క్రీస్తుకి శిరస్సు దేవుడు 1 కొరి 11,3. ఇక్కడ శిరస్సు అంటే అధికారం నెరపేవాడు అని భావం. శిరస్సు మూలంగా శరీరమంతా పోషింపబడి దేవుని వలన కలిగే వృద్ధి ద్వారా పెంపు చెందుతుంది - కోలో 2, 19. కనుక క్రీస్తు జ్ఞానశరీరానికి అధికారియై దాన్ని అభివృద్ధిలోకి తెస్తాడని భావం. ఈ జ్ఞానశరీరానికి లేక తిరుసభకు ఆత్మ నానావరాలు ఇస్తుంది. కొందరికి వ్యాధులు నయంజేసే శక్తి, మరికొందరికి ప్రవచనం చెప్పే శక్తి, ఇంకా కొందరికి భాషల్లో మాటలాడే శక్తి యిస్తుంది - 1 కొరి 12,4-11. ఇవి సేవా వరాలు. గ్రీకులో వీటికి “కరిస్మత" అని పేరు. ఈ వరాలు తిరుసభ అభివృద్ధికి ఉద్దేశింప బడ్డాయి. క్రీస్తు శరీరమైన సంఘాన్ని అభివృద్ధి చేయడం వీటిపని - ఎఫె 4, 12. కనుక ఈ వరాలు కలవాళ్లు గర్వింపకూడదు. సేవచేయడం వాళ్ల పని. ఇంకో విషయం కూడ. ఈ వరాలు కలవాళ్లు తప్పకుండ పవిత్రులై వుండనక్కరలేదు. క్రైస్తవ సమాజాల్లోని పెద్దలు విశ్వాసుల వరాలను గుర్తించి వాటిని వాడుకోవాలి. వాటిని దీపాన్నిలాగ ఆర్పివేయకూడదు - 1 తెస్స 5,19. తిరుసభకు సోదరప్రేమ ప్రధాన లక్షణమై వుండాలి. ప్రేమ వరాలన్నింటినీ మించింది - 1 కొరి 13, 13. ఇంకా తిరుసభ శ్రమలు అనుభవించి క్రీస్తు శ్రమల్లో వున్న కొదవను పూరించాలి. అనగా ఇప్పడు మన శ్రమలు క్రీస్తు శ్రమలతో చేరి తిరుసభకు మేలు చేసి పెడతాయని భావం. L