ఈ పుట ఆమోదించబడ్డది

మాత్రమే కాదు. సామాజికుడు కూడ. అనగా అతడు మన సమాజంలో వసిస్తాడు.

పూర్వం సీనాయి నిబంధనం ద్వారా యిప్రాయేలు ప్రజలు ఒక్క సమాజం అయ్యారు. ఇప్పడు క్రీస్తు సిలువ నిబంధనం ద్వారా మన మంతా ఒక్క సమాజమౌతాం. ప్రభువు తన ఆజ్ఞలను మన హృదయఫలకాలమిరాదనే వ్రాస్తాడు. దీనిద్వారా మనం నూత్నవేద ప్రజలం ఔతాం. ఇదే తిరుసభ.

పౌలు తిరుసభను క్రీస్తు దేహం అని పిల్చాడు -1 కొరి 12,12-13. ఇక్కడదేహం అంటే వ్యక్తి అని భావం. క్రీస్తు తిరుసభ కలసి ఏకవ్యక్తి ఔతారు. దేహం లేక శరీరానికి హీబ్రూలో బసార్ అనీ గ్రీకులో సోమ అనీ పేరు. రోమనులు తమ సమాజంలోని ప్రజలంతా కలసి ఒక్క దేహం అనుకొన్నారు. అందరూ కలసి ఒకే వ్యక్తిగా, ఒకే ఆశయ సాధనం కొరకు కృషి చేయాలి అనుకొన్నారు. ఈ యాశయం సామ్రాజ్యంలో శాంతిని స్థాపించడం, అభివృద్ధిని సాధించడం మొదలైనవి. పౌలు ఈ భావాన్ని క్రీస్తుకి అన్వయించాడు. క్రీసు క్రైస్తవులు కలసి ఒక్క శరీరంగా అనగా ఒక్క వ్యక్తిగా ఐక్యమౌతారు అన్నాడు -1కొరి 12,27. క్రీస్తు లోనికి ఐక్యమైన వాళ్లు పరస్పరం ఐక్యమైతారు. ఒకే శరీరంలోని వేరువేరు అవయవాల వలె మనమందరం పరస్పరం సంబంధం కలిగివుంటాం - రోమూ 125. ఇంకా, ఒకే రొట్టెలో పాలు పొందే మన మందరం ఒకే శరీరం ఔతాం -1కారి 10,17.

మనం క్రీస్తుతో ఐక్యంగావడం ఎంత ముఖ్యమో మనలో వునం ఐక్యంగావడం గూడ అంత ముఖ్యం. దేహంలోని అవయవాలన్నీ ఐకమత్యంగా పనిజేసినట్లే క్రైస్తవ సమాజమంతా