ఈ పుట ఆమోదించబడ్డది

చాలమంది గ్రీకులు క్రీస్తుని విశ్వసించారు. ఆ కాలంలో యూదయ లో కరువురాగా అంతియొకయలోని గ్రీకు క్రైస్తవులు విరాళాలు ఇచ్చారు. బర్నబా సౌలులు ఈ సొమ్మును యెరూషలేముకు కొని వచ్చారు.

మూడు ప్రేషిత యాత్రలు

అంతియొకయలోని క్రైస్తవ సమాజం బర్నబా సౌలులను ప్రేషిత యాత్రలకు పంపింది. యూదులకూ అన్యజాతి ప్రజలకూ గూడ క్రీస్తుని బోధించడం ఈ యాత్రల ఉద్దేశం. మొదటియాత్ర 47-49 సంవత్సరాల్లో జరిగింది. ఈయాత్రలో సౌలు పేరు పౌలుగా మారింది. బర్నబాకు బదులుగా పౌలు నాయకుడయ్యాడు. ఈ యూత్రలో సిప్రు, పిసిడియా అంతియొకయ, ఇకోనియూ, లుస్ర, దెర్బె మొదలైన నగరాల్లో వేదబోధచేసారు. యూదులు పౌలుని కొట్టి హింసించారు. ఐనా చాలమంది గ్రీకులు క్రీస్తుని విశ్వసించారు.

యెరూషలేములోని యూదమతాభిమానులైన క్రైస్తవులు క్రొత్తగా చేరిన గ్రీకు క్రైస్తవులు మోషే ధర్మశాస్తాన్ని పాటించాలని పటుబట్టారు. ఆలాగైతే రక్షణం క్రీస్తునుండి గాక ధర్మశాస్రం నుండి వచ్చినట్లవుతుంది. పైగ యూద తిరుసభ, గ్రీకు తిరుసభ అని రెండు క్రైస్తవ సమాజాలు ఏర్పడతాయి. కనుక పౌలు ఈ వాదాన్ని ఖండించాడు. 49లో యెరుషలేములో మహాసభ జరిగింది. ఈ సభలో గ్రీకు క్రైస్తవులు ధర్మశాస్తాన్ని పాటించనక్కరలేదని నిర్ణయించారు.

రెండవ ప్రేషితయాత్ర 49-52. సంవత్సరాల్లో జరిగింది. పౌలు బర్నబాలు విడిపోయారు. ఈ సారి పౌలు ఫిలిప్పి, తెస్సలోనిక, బెరయ, కొరింతు పట్టణాల్లో బ్బోధించి పలువురను క్రీస్తు శిష్యుల