ఈ పుట ఆమోదించబడ్డది

వరాలనిస్తుంది. వీటిద్వారా క్రైస్తవ సమాజానికి సేవలు చేసి దాన్ని ఓ భవనంలా నిర్మిస్తాం. ఈ వరాలనే శక్తిసామర్థ్యాలు అంటాం -1కొ 12,7-11. స్వార్ణంకొద్దీ మనం ఇతరులకు సేవలు చేయం. కాని ఆత్మ మనలను సేవాపరులనుగా మార్చివేస్తుంది.


9. ఆత్మ మనకు ఉత్థాన భాగ్యాన్ని దయచేస్తుంది -రోమా 8:11. క్రీస్తుని ఉత్థానం చేసింది ఆత్మే. మనకు ఉత్థానాన్ని దయ చేసేది కూడ ఆ యూత్ముడే ఉత్యానంతర్వాత మోక్షభాగ్యం లభిస్తుంది. ఆ భాగ్యం మనకు తప్పక సిద్ధిస్తుంది అనడానికి ఆత్మహామీగా వుంటుంది. బయానాగా వుంటుంది-ఎఫే 1:14.

10. ఆత్మ మనకు ఇన్ని పనులు చేసి పెట్టినా ఆవన్నీ ఒకటే పని అనుకోవాలి. ఆ వొక్కపని, మనకు క్రీస్తుని ఈయడమే. మనం జ్ఞాన స్నానంలోనే ఆత్మను పొందుతాం. అప్పటినుండి ఆత్మ చేసేపని మనలను క్రీస్తుతో జోడించడమే. ఆ యాత్మ వలన తప్ప మనం యేసే ప్రభువు అని అంగీకరించలేం -1 కొరి 12:3. ఇక్కడ ప్రభువు అంటే దేవుడు అని అర్థం. క్రీస్తుని దేవుణ్ణిగా విశ్వసించే భాగ్యం మనకు ఆత్మ నుండిగాని రాదు. విశ్వాస వరం ఆ యాత్మ పెట్టే భిక్ష.

11. ఆత్మ మనకు ఇన్ని మేళ్లు చేస్తుంటే మనం కూడ ఆత్మ పట్ల మనకున్న బాధ్యతలను పాటించాలి. ఆత్మను దుఃఖ పెట్టవద్దు అన్నాడు పౌలు -ఎఫే 4:30.మనం పాపం కట్టుకొన్న పుడల్లా ఆత్మను దుఃఖపెడతాం. దుష్టాత్మ పవిత్రాత్మకు శత్రువు. మనం పిశాచంతో చేతులు కలిపి పాపం చేసినపుడు ఆత్మకు బాధకలుగుతుంది. కనుక క్రైస్తవుడు పాపాన్ని మూనుకోవాలి. ఇంకా, ఆత్మను ఆర్పివేయవదు అనాఘ్రాలు - 1 తెస్స 5:19. (ఇక్కడ