ఈ పుట ఆమోదించబడ్డది

భక్తులకూ పునీతులకూ ప్రార్థన నేర్పింది పవిత్రాత్మే ప్రార్థనను నేర్పమని మనంకూడ ఆ యాత్మను అడుగుకోవాలి. ఉత్థాన క్రీస్తు మోక్షంలో వుండి మన కొరకు ప్రార్థన చేస్తుంటాడు - హెబ్రే 7:25, కాని ఆత్మమన హృదయంలోనే వుండి మన కొరకు జపిస్తుంటుంది. మనం చేసిన కొద్దిపాటి జపాలు కూడ ఆయాత్మ ప్రేరణం లేందే చేసివుండం.

6. ఆత్మ మనకు నాయకుడు. దేవుని ఆత్మచే నడిపింపబడే వాళ్లు దేవుని బిడ్డలు -రోమా 8:14. ఒకవైపు పిశాచంబిడ్డలను పిశాచం నడిపిస్తుంది. వాళ్లచేత దుష్కార్యాలు చేయిస్తుంటుంది. మరోవైపు దేవుని ఆత్మభక్తులను నడిపించి వారిచే సత్కార్యాలు, పుణ్యకార్యాలు చేయిస్తుంది. కాని ఆత్మ మనలను ఏలా నడిపిస్తుంది? దివ్యాత్ముడు మన మనసులో మంచి కోరికలు పుట్టిస్తాడు. ఈ కోరికలనే మనం క్రియలుగా మార్చుకొంటాం. ఇవే మన సత్ర్కియలు. ఆత్మ వలననే మనం మంచి నిర్ణయాలు చేసికొంటాం. వీటి ప్రకారం మంచి పనులు చేస్తాం.

7. మనలో శరీర వాంఛలకూ ఆత్మ వాంఛలకూ మధ్య నిరంతరం పోరాటం జరుగుతూంటుంది. శరీరవాంఛలు పాపాన్ని ఆత్మవాంఛలు పవిత్రతనూ కోరుకొంటాయి. ఈ పోరాటంలో ఆత్ముడు మన పక్షాన నిల్చి ఆత్మవాంఛలను గెలిపిస్తాడు. కావుననే మనం కొద్దిగానైనా పుణ్యక్రియలు చేయగలుతున్నాం. లేకపోతే అసలే రాక్షసులమై పోతాం -రోమా 8:5–9.

8. ఆత్మ మనకు ఫలాలనిస్తుంది. వీటి వలన దివ్యజీవితం గడుపుతాం -గల 5:22-23. శరీరవాంఛల వలన పుటుకు వచ్చే దుష్టకార్యాలను జయిస్తాం -గల 5:19-21 ఇంకా ఆత్మ మనకు