ఈ పుట ఆమోదించబడ్డది

చూడటానికి భయపడ్డారు. తాము దేవునికి బానిసలమనుకొన్నారు. నూత్నవేదంలో మనం దేవునికి బానిసలంగాదు, దత్తపుత్రులం. కనుక దేవుని పట్ల మనకుండవలసింది చొరవగాని భయంకాదు.

3. జ్ఞానస్నానం పొందినప్పటి నుండి ఆత్మమనలను దేవాలయాలనుగా మారుస్తుంది -1కొ 6:19. మందిరంలో దేవుళ్లాగ తాను మనలో నెలకొనివుంటుంది. మనలను పవిత్ర పరుస్తుంది. యెరూషలేం దేవాలయంలో గొర్రెపిల్లలను బలియిచ్చేవాళు. ఆత్మమనలను నిర్మలమైన గొర్రెపిల్లలనుగా తయారుచేసి బలికి సిద్ధంచేస్తుంది - రోమా 15:16,

4. ఆత్మప్రేమశక్తిని మన హృదయాల్లో కుమ్మరిస్తుంది - రోమా 5:5. ఈ ప్రేమతోనే మనం దేవుణ్ణి తండ్రిగా ప్రేమిస్తాం. క్రీస్తుని రక్షకుణ్ణిగా ప్రేమిస్తాం. ఇంకా తోడి నరులను తోబుటువులనుగా ప్రేమిస్తాం. మన శరీరానికి ఆత్మవుంది. దేహంలోని అవయవా లన్నిటినీ ఐక్యపరచేది ఆత్మ అలాగే తిరుసభ అనే జ్ఞాన దేహంలోని సభ్యులందరినీ ఐక్యపరచేది పావనాత్మ పొడిపిండి ముద్దకాదు, తడిపిండి ముద్ద ఔతుంది. ఆత్మ మనలను తడిపిండి లాగ చేస్తుంది. ఆ దివ్యశక్తి లేకపోతే మనకు సోదరప్రేమ అలవడదు. దివ్యాత్మ క్రైస్తవ సమాజమంతటిని ఒక్కమందిరంగా నిర్మిస్తుంది.

5. ఆత్మ మనకు ప్రార్థనా శక్తిని దయచేస్తుంది. మనంతట మనకు ఏలా జపించాలో, ఏమి జపించాలో తెలియదు. ఆత్మమన హృదయాల్లో వుండి మనచేత జపం చేయిస్తుంది - రోమా 8:26-27. తల్లి తాను నడుసూ చిన్నబిడ్డను నడిపిస్తుంది. బిడ్డకు నడక నేర్పిస్తుంది. అలాగే ఆత్మ మనహృదయంలో తాను ప్రార్ధనచేసూ మన చేత ప్రార్థన చేయిస్తుంది. మన ప్రార్థనను దేవునికి అర్పిస్తుంది.