ఈ పుట ఆమోదించబడ్డది

నవఫలాలు దయచేస్తాడు. అంత మాత్రమేగాదు, తన్నే మనకు ప్రధాన వరంగా ఇచ్చుకొంటాడు.

ఆత్మ మనకు దేవుణ్ణి దైవరహస్యాలనూ తెలియజేస్తుంది - 1 కొరి 2,10. తండ్రి క్రీస్తు ద్వారా నరులను రక్షిస్తాడనే రహస్యాన్ని పౌలుకి తెలియజేసింది ఈయాత్మే ఇప్పడు మనం వేదసత్యాలను లోతుగా అర్థంజేసికొనేలా చేసేది కూడ ఈ ప్రభువే. మన తరపున మనం ఆత్మ ప్రబోధాలను వినాలి. ఆత్మప్రేరణం ప్రకారం నడచుకోవాలి. దీన్నే పౌలు ఆత్మానుసారంగా జీవించడం అన్నాడు - రోమా 8, 4. ఆత్మచే నడిపింపబడ్డం అనికూడ పేర్కొన్నాడు - రోమా 8,14.

పౌలుపవిత్రాత్మను గూర్చి చాల విషయాలు చెప్పాడు. వాటిల్లో ప్రస్తుతానికి 11 అంశాలను పరిశీలిద్దాం.

1. జ్ఞానస్నాన సమయంలో ఆత్మ మన హృదయం మీద క్రీస్తుని ముద్రవేస్తుంది. కనుకనే పౌలు "మీరు ఆత్మచేత ముద్రింప బడితిరి" అన్నాడు - ఎఫే 1:13. ఆరోజుల్లో బానిసల మీద యజమానుని ముద్ర, భక్తుల మీద దేవతలముద్ర వుండేవి. ఆ బానిసలు ఆ యజమానులకూ, ఆ భక్తులు ఆ దేవతలకూ చెందిన వాళ్లని ఈ ముద్రభావం. జ్ఞానస్నానానికి ముందు మనమీద పిశాచముద్ర వుంటుంది. జ్ఞానస్నానానంతరం క్రీసు ముద్రను పొందుతాం. అనగా మనం జ్ఞానస్నానంతో పిశాచ యాజమాన్యాన్ని తప్పించుకొని క్రీస్తుని యజమానునిగా పొందుతామని భావం.

2. ఆత్మ మనకు దైవపుత్రత్వాన్ని దయచేస్తుంది - రోమా, 8:14-16. ఆ యాత్మ అనుగ్రహంవలన దేవుణ్ణి అబ్బా - అనగా నాన్నా అని పిలుస్తాం. పూర్వవేదంలోని యూదులు దేవుణ్ణి