ఈ పుట ఆమోదించబడ్డది

తండ్రే. అతడు తానెన్నుకొన్నవారిని తన కుమారుని రూపం పొందేలా చేసాడు. తానెన్నుకొన్నవారిని పిల్చి నీతిమంతులను జేసాడు. వారికి తన మహిమలో పాలిచ్చాడు -రోమా 8,28-30. లోకసృష్టికి పూర్వమే అతడు క్రీసు ద్వారా వునలను ఎన్నుకొన్నాడు. వునం పవిత్రులంగాను నిర్దోషులంగాను వుండాలని అతని కోరిక. క్రీస్తు ద్వారా మనలను తన పుత్రులనుగా చేసికొన్నాడు. క్రీస్తుద్వారా తన రక్షణ ప్రణాళికను మనకు తెలియజేసాడు -ఎఫె 14-7. ఈలాంటి తండ్రితో మనం ఐక్యమౌతాం.

దేవుని ఆత్మమనచే దేవుణ్ణి అబ్బా- నాన్నా అని పిలిపిస్తుంది. మనలను దేవునికి దత్తపుత్రులను చేస్తుంది -రోమా 8,15-16. నరమాత్రుడు దేవునికి బిడ్డడు కావడం సామాన్య భాగ్యమా? క్రీస్తు ద్వారా మనం దేవునికి దత్తపుత్రులం ఔతాం. క్రైస్తవుడు ప్రధానంగా దేవునికి తనపట్లగల ప్రేమను అనుభవపూర్వకంగా తెలిసికొనినవాడు.


దేవుడు మన పక్షాన వుంటే మనకు కీడు చేసే విరోధి ఎవడూ వుండడు. తనసొంత కుమారునే మనకిచ్చిన తండ్రి ఇతర వస్తువులను కూడ యిస్తాడు. క్రీస్తుద్వారా తండ్రికి మనపట్ల గల ప్రేమనుండి బాధగాని హింసగాని మరణంగాని మనలను వేరు చేయలేవు -రోమా 8,31-35.

3. ఆత్మతో ఐక్యత

క్రీనుతో ఐక్యత ఆత్మతో గూడ ఐక్యతను సాధించి పెడుతుంది. తండ్రి రక్షణ ప్రణాళికను తయారు చేసింది నరునికి దివ్యత్వాన్ని ఈయడానికే. నరుణ్ణి దత్తపుత్రుని చేయడంద్వారా అతనికి ఈ దివ్యత్వం సిద్ధిస్తుంది. తండ్రి ఉత్థాన క్రీస్తుద్వారా నరునికి ఆత్మను ప్రసాదిస్తాడు. ఈయాత్మవలన నరుడు దత్తపుత్రుడు ఔతాడు. క్రైస్తవుడు ఒకసారి ఆత్మను పొందాక ఇక అతన్ని నడిపించేది ఆయూత్మే -రోమా 8,14.