ఈ పుట ఆమోదించబడ్డది

కావడం. మనం నీతిమంతులం కావడానికి దేవుడు క్రీస్తుని పాపంలో పాలు పంచుకొనేలా చేసాడు -2కొరి 5,21.

మూడవది క్రీస్తునందు అంటే నరులు దివ్యశక్తిని పొందడం. నన్ను బలపరచేవాని శక్తిచే నేను ఏ కార్యాన్నయినా సాధించగలను –ඨිච් 4,13.

మనం ఐక్యమయ్యేది ప్రధానంగా ఉత్థానక్రీస్తుతో, పౌలుకి పాలస్తీనా దేశంలో జీవించిన క్రీస్తుకాక ఉత్థాన క్రీస్తు ముఖ్యం -2కొరి 5,16. ఉత్థానక్రీస్తు తన ఆత్మద్వారా మనకు దివ్యత్వాన్ని ప్రసాదిస్తాడు. మొదటి ఆదాము జీవించే ప్రాణి అయ్యాడు. కాని రెండవ ఆదామైన క్రీస్తు జీవమిచ్చే ఆత్మ అయ్యాడు -1కొరి 15,45. అనగా మొదటి ఆదాము తనకుతాను జీవించాడు. రెండవ ఆదామైన క్రీస్తు మనకు జీవాన్ని ప్రసాదించేవాడు అయ్యాడు. ఆత్మద్వారా అతడు మనకు జీవాన్ని ఇస్తాడు. అతడు మనలను తనకు సొంతం జేసికొంటాడు. ఇక మనం అతనికి చెందిన ఆస్తివంటివాళ్లమౌతాం. అనగా అతనికి ప్రీతిపాత్రులం, విలువగలవాళ్లం ఔతాం. అతడు మనలో వసిసూ మనకు తన రూపాన్ని దయచేస్తాడు. మనం అతనితో సారూప్యం చెందుతాం -రోమా 8,29. ఈ విధంగా మనం క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందుతాం -ఎఫె 4,13.

పౌలు తరచుగా క్రైస్తవులను పరిశుదులు అని పేర్కొంటాడు -రోమా 1,7. క్రీస్తుతో ఐక్యమై అతని సొత్తు కావడం వల్లనే క్రైస్తవులు పరిశుదులు అయ్యూరు. ఇది వారి ఘనత.

పౌలుకి మనం ఉత్థాన క్రీస్తుపట్ల విశ్వాసం వుంచడం ముఖ్యం. ఈ విశ్వాసం భక్తుని జీవితంలో ప్రతిక్షణం కన్పించాలి. అతడు జీవితాంతం క్రీస్తుపై ఆధారపడి, క్రీస్తుని నమ్మి జీవించాలి. విశ్వాస వాతావరణంలో వుండిపోవాలి. నిరంతరం క్రీస్తుతో చనిపోయి