ఈ పుట ఆమోదించబడ్డది
3. క్రీస్తుతో ఐక్యత
ఇక్కడ మూడంశాలను పరిశీలిద్దాం.
1. క్రీస్తుతో ఐక్యత

నరుడు పాపాన్నీ, శరీరాన్నీ ధర్మశాస్తాన్నీ త్యజించి క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందుతాడు. దాని వలన ఆ ప్రభువుతో ఐక్యమౌతాడు. అతని లోనికి ప్రవేశిస్తాడు. అతనితో కలిసిపోతాడు.

"క్రీస్తునందు" అనే ప్రయోగం పౌలు జాబుల్లో 200 సారు కన్పిస్తుంది. (గ్రీకులో ఎన్ క్రీస్తో). ఈ ప్రయోగానికి క్రీస్తు క్రైస్తవుడు కలిసి ఏకవ్యక్తిగా జీవిస్తారని, అనగా ఒకే జీవితం గడుపుతారని భావం. "ఎవడైన క్రీస్తునందు వుంటే అతడు నూత్న వ్యక్తి ఔతాడు" -2కొరి 5,17. ప్రాతసృష్టి, ప్రాత ఆదాము పాపానికి చిహ్నాలు. నూత్న సృష్టి నూత్న ఆదాము పవిత్రతకు చిహ్నాలు. పౌలు కొన్నిసార్లు నరుడు క్రీస్తునందు ఉంటాడు అని చెప్తాడు. కొన్నిసార్లు క్రీస్తే నరునియందు ఉంటాడు అని చెప్తాడు. రెండిటి భావం ఒకటే. "ఇక జీవించేది నేను కాదు నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు" -గల 2.20. అనగా క్రైస్తవునికి ప్రత్యేకమైన వునుగడ లేదనీ, అతని జీవితం క్రీస్తుజీవితంతో కలిసిపోయిందనీ భావం.

పౌలు భావాల ప్రకారం "క్రీస్తునందు" అంటే ఓ స్థలంలో వుండడం కాదు. నరుడు క్రీస్తు శక్తికీ వరప్రసాదానికీ లోను గావడం. పౌలు జాబుల్లో క్రీస్తునందు అనే ప్రయోగానికి కనీసం మూడర్గాలు కన్పిస్తాయి. మొదటిది, క్రీస్తునందు అంటే నరులు నూత్నజీవాన్ని పొందడం. ఎవడైన క్రీస్తునందు వుంటే నూత్న సృష్టి ఔతాడు -2కొరి 5, 17. క్రీస్తునందు వుండడం వల్ల నరులు దేవుని కుమారులు ఔతారు. పరిశుదులు, వెలుగు ఔతారు. తీర్పుకి గురికారు.

రెండవది, క్రీస్తునందు అంటే నరులు నీతిమంతులు