ఈ పుట ఆమోదించబడ్డది

తీతు జాబు 3,5-7 వచనాలు జ్ఞానస్నానాన్ని సంగ్రహంగా వర్ణిస్తాయి. ఇక్కడ మొత్తం ఐదంశాలు వున్నాయి. 1. జ్ఞానస్నానం స్నానం. మామూలు స్నానం భౌతికమైన మాలిన్యాన్ని లాగే ఇది మన పాపమాలిన్యాన్ని కడిగివేస్తుంది. 2. ఇది మనకు నూత్న జన్మనిస్తుంది. మనం మొదటి జన్మవలన పాపానికి దాసుల మయ్యూం. ఈ రెండవ జన్మ వలన దేవుని బిడ్డలమా తాం. 3. ఇది మనకు నూత్నత్వాన్ని ఇస్తుంది. ఆత్మ అనుగ్రహం వల్ల నరుడు తనలోని ప్రాత మానవుణ్ణి విడనాడి నూత్న మానవుణ్ణి పొందుతాడు. అతడు పూర్తిగా మారిపోయి క్రొత్త నరుడు ఔతాడు. 4. ఈ సంస్కారంలో మనం ఆత్మను పొందుతాం. తండ్రి క్రీస్తుద్వారా ఆత్మను మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. 5. ఈ సంస్కారం మనలను దత్తపుత్రులనుగా మార్చి మోక్షానికి వారసులను చేస్తుంది. ఈ మోక్షం మనకింకా లభించలేదు. కాని ఒకరోజు అది మనకు లభించడం ఖాయం.

తొలిరోజుల్లో పెద్దవాళ్లకే జ్ఞానస్నానం ఇచ్చేవాళ్లు. అదీ మడుగులో ఇచ్చేవారు. నీటిలోనికి పోవడం నీటినుండి బయటికి రావడం వారికి దివ్యమైన అనుభూతిని కలిగించేవి. కనుక వారికి జ్ఞానస్నానం మరపురాని సంఘటనంగా వుండేది. నేడు మనం శిశువులంగా జ్ఞానస్నానం పొందుతున్నాం. అదీ నొసటివిూద నీళ్లు పోయడం ద్వారా. కనుక పూర్వులకు కలిగిన దైవానుభూతి ఇప్పడు మనకు కలగడం లేదు. క్రైస్తవ జీవితమంటే ప్రధానంగా జ్ఞానస్నాన జీవితమే. క్రీస్తుతో ఐక్యమై జీవించడమే. మనం జ్ఞానస్నానాన్ని మించిన పవిత్రతను ఏనాడు సాధించలేం.