ఈ పుట ఆమోదించబడ్డది

అతనితోపాటు జీవిస్తాం -రోమా 6,8.
క్రీస్తుతోపాటు అతని పోలికను పొందుతాం -ఫిలి 3,11.
అతనితోపాటు మహిమను పొందుతాం -రోమా 8, 17.
అతనితోపాటు పరిపాలనాధికారం పొందుతాం -ఎఫె 2.6.
అతనితోపాటు పరిపాలిస్తాం -2తిమో 2,12.
అతనితోపాటు అతని రూపాన్ని పొందుతాం - రోమా 8,29.
అతనితోపాటు మోక్షానికి వారసులమగౌతాం -రోమా 8, 17.
క్రీస్తుతోపాటు భాగసులమతాం -ఎఫె 3,6.

ఈ ప్రయోగాలను బట్టి జ్ఞానస్నానం మనలను క్రీస్తుతో ఎంత గాఢంగా ఐక్యం జేస్తుందో అర్థంచేసికోవచ్చు.

తొలి ఆదాములాగే రెండవ ఆదామైన క్రీను కూడ సామూహిక వ్యక్తి. అతడు మనలనందరినీ తనతో కలుపుకొని మనతోపాటు ఏకవ్యక్తి ఔతాడు. పౌలు మనం జ్ఞానస్నానం పొందింది క్రీస్తులోనికి అని చెప్తుంటాడు. ఇంకా క్రీస్తునామంలోనికి జ్ఞానస్నానం పొందామనిగూడ చెప్నంటాడు -1కొరి 6,11. క్రీస్తు నామంలోనికి జ్ఞానస్నానం పొందడమంటే క్రీస్తు అనే వ్యక్తిలోనికి ప్రవేశించి అతనితో కలిసిపోవడం. అతని ఆస్తిగా మారి అతనికి సొంతమై పోవడం. ఈ సంస్కారం ద్వారా క్రీస్తుతో కలిసిపోయినపుడు అతని మరణోత్థానాలే మనకూ సంభవిస్తాయి. ఇంకా ఈ సంస్కారం ద్వారా మనం నూత్న సృష్టి ఔతాం -2కొరి 5, 17. మొదటి సృష్టికి బదులుగా రెండవసృష్టి వస్తుంది. జ్ఞానస్నాన ఫలితాలు ఈలాగుంటాయి. ఈ క్రియద్వారా దేవుని ఆత్మ ఓ దేవాలయంలో లాగ మనలో వసిస్తుంది -1కొరి 6,19. ఈ క్రియవల్ల ఆత్మ మనలను దేవునికి దత్తపుత్రులను చేస్తుంది -గల 4,6.