ఈ పుట ఆమోదించబడ్డది
2. జ్ఞానసాసం

పౌలు బోధల ప్రకారం విశ్వాసమూ జ్ఞానస్నానమూ కలసి పోతాయి. విశ్వాసానికి జ్ఞానస్నానం ముద్రలాంటిది. అనగా అది మన విశ్వాసాన్ని పదిలపరచేది. విశ్వాసం లోపల హృదయంలో వుంటుంది. బయటికి కన్పించదు. కాని జ్ఞానస్నానం సంస్కార రూపంలో వుండి బయటికి కన్పిస్తుంది. ఈ రెండిటిద్వారా మనం క్రీస్తుతో ఐక్యమౌతాం. జ్ఞానస్నానం మనలను క్రీస్తుతోనే గాక క్రైస్తవసమాజంతో గూడ ఐక్యపరుస్తుంది. ఈ సమాజం క్రీస్తుదేహమే. మనమందరం ఒకే ఆత్మ ద్వారా ఒకే శరీరంగా జ్ఞానస్నానం పొందుతాం -1కొరి 12,13. దీని ద్వారా క్రీస్తు దేహంతో కలిసిపోతాం.

పౌలు జ్ఞానస్నానానికి కొన్ని ఉపమానాలు వాడాడు. నీరు మురికిని కడిగివేస్తుంది. ఆలాగే జ్ఞానస్నానం మన పాపమాలిన్యాన్ని కడుగుతుంది -1కొరి 6,11. ఈ సంస్కారం ద్వారా మనం క్రీస్తుని ఓ దివ్యవస్రంలాగ ధరిస్తాం -గల 3,27. ఆ రోజుల్లో గ్రీకు భక్తులు ఓ దేవత వస్తాలను ధరించి తామూ ఆ దేవతతో ఐక్యమైపోయామని చెప్పకొనేవాళ్లు. కనుక ఇక్కడ క్రీస్తుని ధరించడమంటే అతనితో ఐక్యంగావడమని భావం. ఈ సంస్కారం ద్వారా మనకు మోక్షజీవితం ఇక్కడే ప్రారంభమౌతుంది -ఎఫె 2.5-6. ఇంకా ఈ క్రియద్వారా మనం నూత్న యిప్రాయేలు మా తాం. పూర్వం యిప్రాయేలు ప్రజలు రెలు సముద్రం దాటి మోషే నాయకత్వాన జ్ఞానస్నానం పొందారు -1కొరి 10,1-2, కాని మనం క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన నూత్న యిస్రాయేలుమి.

కాని జ్ఞానస్నానాన్ని గూర్చిన పౌలు ముఖ్యభావం ఇది. ఈ సంస్కారం వలన మనం క్రీస్తుతోపాటు మరణించి, అతనితోపాటు