ఈ పుట ఆమోదించబడ్డది

చేయించుకోకముందే అతడు పవిత్రుడు. అతడు కేవలం విశ్వాసం వల్లనే రక్షణం పొందాడు ఏలాగ? అతడు అతని భార్య వృదులు. ఆ ముసలి ప్రాయంలో దేవుడు అబ్రాహాముకి నేను నీకొక కుమారుణ్ణి ప్రసాదిస్తాననీ, ఆ కుమారుని ద్వారా నీ సంతతి అనంతంగా వ్యాపిస్తుందనీ చెప్పాడు. అబ్రాహాము దేవుని వాక్కుని నమ్మాడు. ఆ నమ్మకం ద్వారా దేవుడు అతన్ని నీతిమంతునిగా గణించాడు. అనగా పుణ్యాత్ముణ్ణిగా ఎంచాడు -ఆది 15,6. ఇది అబ్రాహాము విశ్వాసం.

పౌలు ఈ విశ్వాసాన్ని రోమా 4,16-25లో విపులంగా వర్ణించాడు. అబ్రహాము నూరేండ్ల ముదుసలి. సారా గొడ్రాలు. ఐనా అతడు ఆ ప్రాయంలో గూడ దేవుని వాక్కు ప్రకారం తనకు సంతానం కలుగుతుందని నమ్మాడు. నమ్మకానికి ఆధారం లేనపుడు గూడ నమ్మాడు. దేవునికి తన వాగ్దానాన్ని నెరవేర్చే శక్తి వుందని నమ్మాడు. అతడు మృతులకు జీవమిస్తాడని నమ్మాడు. ఆ నమ్మకం వల్లనే దేవుడు అతన్ని నీతిమంతునిగా లెక్కించాడు. ఈ యజ్రాహాం విశ్వాసం నేడు మనకు కూడ అవసరం. తండ్రి క్రీస్తుని జీవంతో లేపినట్లే విశ్వాసం ద్వారా మనలను కూడ చావునుండి జీవానికి కొనిపోతాడు.

కనుక విశ్వాసమంటే దేవుని వాక్కునీ, అతని శక్తినీ నమ్మడం. ఆ దేవునికి ఆత్మనివేదనం చేసికోవడం. ఆ దేవుడు క్రీనుద్వారా వునలను రక్షిస్తాడని నమ్మి అతని అధీనంలో వుండిపోవడం. నూటికి నూరుపాళ్లు అతనిపై ఆధారపడి జీవించడం. విశ్వాసం లేకపోతే దేవునికి ప్రీతి కలిగించలేం హెబ్రే 11,6. అది వుంటే చాలు రక్షణం పొందుతాం. ఇక్కడ చెప్పినదాన్ని బట్టి నేడు మన విశ్వాసంలో ఎంత గట్టితనంవుందో పరిశీలించి చూచుకొందాం.