ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వాసం ఓ రకమైన మనస్తత్వం. అది నిరంతరం మన హృదయంలో నిల్చివుంటుంది. నీ నోటితో యేసే ప్రభువని వొప్పకొని, దేవుడు అతన్ని లేవనెత్తాడని హృదయంలో విశ్వసిస్తే నీవు రక్షణం పొందుతావు-10,9. విశ్వాసి క్రీస్తుతో ఐక్యమై అతడు ఆర్జించిన రక్షణంలో పాలుపొందుతాడు. విశ్వాసంగలవాడు పూర్తిగా క్రీసుతో కలసి పోతాడు. ఇక నేనుగాదు, నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు. నన్ను ప్రేమించి నాకొరకు ప్రాణత్యాగం చేసికొనిన దేవుని పుత్రునియందలి విశ్వాసం చేతనే ఇప్పడు నేను ఈ శారీరక జీవితాన్ని గడుపుతున్నాను అని చెప్పకొంటాడు -గల 2.20.


క్రీస్తుతో ఐక్యమైన విశ్వాసి ఆ ప్రభువు దేహంతో గూడ ఐక్యమైపోతాడు. ఆ దేహానికి క్రీస్తే శిరస్సు. ఆ దేహం క్రైస్తవ సమాజమే. క్రీసుపట్ల విశ్వాసం గలవాడు క్రీసు శరీరంలో అవయవాలైన తోడి క్రైస్తవులను గూడ ప్రేమిస్తాడు. వారికి ప్రేమతో సేవలు చేస్తాడు -గల 5,6. ఈ సేవాకార్యాలవల్ల మనకు రక్షణం కలగదు. రక్షణం పొందాం గనుక పర్యవసానంగా మనం సేవాకార్యాలు చేయాలి.ఈ సందర్భంలో పౌలు ఒకరినొకరు ప్రేమతో సేవించండి అన్నాడు -గల 5,13. అతనికి సోదర పేవు అతిముఖ్యమైన సూత్రం. 1కొరి 13వ అధ్యాయంలో ఆ ప్రేమలోని 11 లక్షణాలను వర్ణించాడు. ఈ ప్రేమవల్ల మన విశ్వాసం మృతవిశ్వాసంగాక సజీవవిశ్వాసం ఔతుంది -యాకో 2,14. మనచే ప్రేమ భావంతో సేవలు చేయించే మహాశక్తి పవిత్రాత్మే -రోమా 5,5.


మన విశ్వాసానికి గొప్ప ఆదర్శం అబ్రాహాము. అతడు ధర్మశాస్రం వలన రక్షణం పొందలేదు. అది అతడు గతించాక 400 ఏండ్లకు గాని రాలేదు. సున్నతి వలన రక్షణం పొందలేదు. దాన్ని