ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మశాస్త్రం ఆజ్ఞాపించే క్రియలను చేయడం వలన కాదు -రోమా 3,28.

కాని క్రీస్తు పట్ల విశ్వాసం అంటే యేమిటి? బోధకులు క్రీస్తుని బోధిస్తారు. ప్రజలు ఆ బోధను విని క్రీస్తుని నమ్ముతారు. తండ్రి అతన్ని పంపాడనీ, అతని మరణోత్థానాల ద్వారా మనకు రక్షణం కలుగుతుందనీ విశ్వసిస్తారు. దీనివల్ల వాళ్లు జీవాన్ని పొందుతారు -10,8-10. మన భక్తివల్లా, మన పుణ్యక్రియలవల్లా మనం రక్షణం పొందం. తండ్రే క్రీస్తుద్వారా మనలను రక్షిస్తాడు. కనుక విశ్వాసమంటే దేవుణ్ణి నమ్మడం, అతనికి విధేయులం గావడం. నరుడు విశ్వాసానికి విధేయుడు కావాలి -1.5. దేవుని పలుకులను నమ్మాలి.

వున విశ్వాసానికి కర్త దేవుడే. మనంతట మనం విశ్వసించలేం. అది మననుండి రాదు, దేవునినుండే వస్తుంది. కనుక అది మనకు దేవుని వరం. విశ్వాసం ద్వారా దేవుని కృపచేతనే మినారు రక్షింపబడ్డారు. అది విూ వలన కలిగింది కాదు, దేవుని వరం -ఎఫె 28. ఐనా నరులు ఈ వరాన్ని నిరాకరించవచ్చు. దేవుని కుమారుడైన క్రీస్తుని అంగీకరించకపోవచ్చు. శతాబ్దాల పొడుగున చాలమంది ఈలాగే చేసారు గదా!

మనం విశ్వసించేది ఏవో కొన్ని నిర్జీవ సూత్రాలను కాదు, ఓ వ్యక్తిని. ఆ వ్యక్తి తండ్రి కావచ్చు, లేక క్రీస్తు గావచ్చు. వాళ్లిద్దరూ ఎప్పడూ కలిసేవుంటారు. కనుక ఆ యిద్దరిలో ఎవరిని నమ్మినా యిద్దరినీ నమ్మినట్లే.

మనం మన పుణ్యకార్యాలద్వారా రక్షణాన్ని పొందలేం. క్రీస్తుని పంపిన తండ్రిని నమ్మి, క్రీస్తునినమ్మి రక్షణం పొందుతాం. ధర్మశాస్ర క్రియలు మనలను రక్షిస్తాయని వాదించేవాళ్ల మాటలు బడాయి మాటలు -రోమా 3,23