ఈ పుట ఆమోదించబడ్డది

తొలగించాడు. మనలను నీతిమంతులను చేసాడు. తనకు శత్రువు లైనవారిని మిత్రులనుగా మార్చివేసాడు. మనం శక్తిలేని వాళ్లంగా వున్నపుడు ఉచితకాలంలో భక్తిహీనులకొరకై క్రీస్తు మరణించాడు - 5,6. మనమింకా పాపులంగానే వున్నపుడు క్రీస్తు మనకొరకు మరణించాడు అంటే దేవునికి మనపైవున్న ప్రేమ అర్థమౌతుంది -5,8. క్రీస్తురాకడ పాపులను పరిశుదులను చేసింది.

7. క్రీస్తువచ్చాక నరుల్లో కలిగిన మార్పు

పూర్వాధ్యాయంలో క్రీస్తు రాకముందు నరుల పరిస్థితి ఏలా వుందో పరిశీలించి చూచాం. ఇప్పడు ఆ ప్రభువు వచ్చాక మన పరిస్థితి ఏలా మారిపోయిందో పరిశీలించాలి. క్రీస్తుద్వారా నరులు మళ్లా దేవునితో ఐక్యమయ్యారు. ఈ దశను పౌలు నూత్నసృష్టి అని పేర్కొన్నాడు. క్రీస్తు రాకడవల్ల నరుల పరిస్థితిని మార్చివేసిన అంశాలు ప్రధానంగా ఐదున్నాయి. అవి క్రీస్తుపట్ల విశ్వాసం, జ్ఞానస్నానం, క్రీస్తుతో ఐక్యత, తిరుసభ, సత్ర్ససాదం. ఈ యైదింటిద్వారా మనం క్రీను రక్షణాన్ని సంపూర్ణంగా పొందుతాం. ఇక ఈ యైుదు విషయాలను విపులంగా పరిశీలిద్దాం.

1. క్రీస్తుపట్ల విశ్వాసం

పౌలు భావాల ప్రకారం క్రీస్తుపట్ల విశ్వాసం అతి ముఖ్యమైన అంశం. అది లేందే మనకు రక్షణం లేదు. యూదమతాభిమానులు ధర్మశాస్రంలోని ఆజ్ఞలను పాటించడం ముఖ్యం అన్నారు. వారిదృష్టిలో అవి పుణ్యక్రియలు. వాటివల్లనే మనకు రక్షణం కలుగుతుందని వాళ్ల వాదం. పౌలు ఈ వాదాన్ని పూర్తిగా ఖండించి క్రీస్తు పట్ల విశ్వాసం ఒక్కటే మనకు రక్షణాన్ని ప్రసాదిస్తుంది అని బోధించాడు. నరుడు నీతిమంతుడు అయ్యేది విశ్వాసం వలనగాని