ఈ పుట ఆమోదించబడ్డది

దృష్టిలో మృత్యువు అంటే శారీరకమైన చావు, ఆధ్యాత్మికమైన చావు కూడ. ఒక నరునిద్వారా పాపంలోకంలోనికి ప్రవేశించింది. పావంనుండి వురణం వచ్చింది. వూనవులందరు పాపం కటుకొన్నారు కనుక అందరికీ మరణం వ్యాపించింది - రోమా 5, 12. ఆదాము పాపంద్వారా అందరికీ మరణం దాపురించింది. కాని రెండవ ఆదామైన క్రీస్తు మరణం ద్వారా ఇప్పటి మన మరణం తన శక్తిని కోల్పోయింది. మరణం ములు పాపం - 1 కొరి 15,56. అనగా మరణం పాపంనుండి శక్తిని తెచ్చుకొని పాము తేలులాంటి విషజంతువుల్లా మనలను కరుస్తుంది. మరణం మన తుది శత్రువు. ప్రభువు రెండవరా కడతోగాని అది గతించదు - 1రి 15, 26.

ఉపసంహారం

పైన క్రీసు రాకముందు నరుల వరిస్థితి ఎలావుందో పరిశీలించి చూచాం. నరులు పాపానికి దాసులయ్యారు. శరీరం క్రిందికి లాగింది. ధర్మశాస్త్రం క్రుంగదీసింది. మృత్యువు వారిని మ్రింగివేసింది. మనం శరీరానుసారంగా జీవించినపుడు ధర్మశాస్రం పురికొల్పిన పాపవాంఛలు మన శరీరంలో విజృంభించి మృత్యువుని తెచ్చిపెట్టాయి. -రోమా 75. నరుడు పడిపోయాడు. ఇక అతడు తన్నుతాను ఉద్ధరించుకోలేడు. శాస్త్రరంగంలో ఎంత ప్రగతిని సాధించినా ఆధ్యాత్మికరంగంలో కూలబడేవుంటాం. కనుక అతడు అయ్యో! నేనెంత దౌర్భాగ్యుణ్ణి! మరణకారకమైన ఈ శరీరం నుండి నన్ను విడిపించేదెవడు అని దీనంగా అరచాడు.

కాని నరుణ్ణి ఆ దౌర్భాగ్యస్థితినుండి విడిపించే ప్రభువు క్రీస్తు ఉన్నాడు - రోమా 7.24-25. అతని మరణోత్థానాలు మనకు రక్ష. క్రీస్తురాకముందు మనం ఎంత నిర్భాగ్యులమో అతడు వచ్చాక అంత ధన్యులమయ్యాం. తండ్రి దయతో క్రీస్తుద్వారా మన వెతలన్నీ