ఈ పుట ఆమోదించబడ్డది
7.పవిత్రపరచడం

పూర్వవేదంలో నరులూ వస్తువులూ కూడ పవిత్రతను పొందుతారు. మండుతూవున్న పొదకు దగ్గరి స్థలం, యెరూషలేము నగరం, యిప్రాయేలు ప్రజలు, యూజకులు, ప్రవక్తలు మొదలైన వాళ్లు పవిత్రులు. ఈ నరులు పవిత్రులైంది తమ పుణ్యక్రియలవల్ల కాదు. పవిత్రుడైన దేవునికి అంకితం కావడం వల్ల, బైబులు భావాల ప్రకారం పవిత్రతలో రెండంశాలువున్నాయి. మొదటిది ఓ వస్తువునిగాని నరునిగాని పాపపులోకంనుండి వేరుచేయడం. రెండవది ఆ వస్తువుని లేక నరుని పవిత్రుడైన దేవునికి అర్పించడం. అనగా దేవుని సేవకు వినియోగించడం. అన్నిటిని పవిత్రపరచేవాడు దేవుడే.


పౌలు ఈ భావాన్ని క్రీస్తుకి అన్వయించాడు. దేవుడు క్రీస్తుని మనకొరకు పవిత్రతనుగా చేసాడు -1కొరి 1,30. అనగా క్రీస్తు తన సిలువ మరణం ద్వారా మన పాపాలను తొలగించి మనలను దేవునికి సమర్పించాడని భావం. ఆలా దేవునికి అంకితమైన మనం ఎల్లప్పడు దేవుని సేవలోనే వుంటాం.దేవుడు మనలను పవిత్ర జీవితం గడపడానికే పిల్చాడు -1తెస్స 4,7. దేవుని ఆత్మ కూడ మనలను పవిత్రులను చేస్తుంది -రోమా 15,16.


పౌలు తన జాబుల్లో క్రైస్తవులందరినీ పరిశుదులు అనే పిలుస్తుంటాడు. క్రీస్తుని విశ్వసించి అతనిలోనికి జ్ఞానస్నానం పొందడం ద్వారానే మనం పరిశుదులమా తాం. కనుక క్రైస్తవభక్తుడు ఎప్పడూ పవిత్రంగా జీవించాలి.

8. మార్చివేయడం

దేవతలు నరులను చెటుచేమలుగానో రాయిరప్పలుగానో మార్చివేసినటుగా గ్రీకు రచయితలు కథలు అల్లారు. ఈలా మార్పు చెందడాన్ని గ్రీకులో "మెటమోర్ఫోసిస్" అంటారు. పౌలు ఈ భావాన్ని