ఈ పుట ఆమోదించబడ్డది

పౌలు ఈ భావాలను క్రీస్తుకి అన్వయించాడు. క్రీస్తు మనకు విమోచనం సంపాదించి పెట్టినవాడు -1కొరి 1,30. అనగా మనం పాపం వలన పిశాచానికి దాసులమైతే క్రీసు మనలను ఆ దాస్యంనుండి విడిపించాడు. ఈ విమోచనం మనకు క్రీసు చిందించిన నెత్తురు ద్వారా లభించింది -ఎఫె 1,7.

ఈ విమోచనం ఇదివరకే జరిగినా అది అంత్యకాలంలో గాని పరిపూర్ణంగాదు. అప్పటిదాకా మనం శరీరం యొక్క విముక్తి కొరకు ఎదురుచూసూ మనలో మనం మూలుగుతూంటాం -రోమా 8,23.

ఇంకా క్రీస్తు మనలను వెలయిచ్చి కొన్నాడు -1కొరి 6,20. ఈవెల క్రీస్తు సిలువ మరణం, అతడు చిందించిన నెత్తురు. కనుక మనం ఆ యజమానునికి చెందిన వాళ్లం ఔతాం.

యూవే ఫరోకు క్రయధనం చెల్లించకుండానే యూద బానిసలను దాస్యం నుండి విడిపించాడు. ఆలాగే క్రీస్తు పిశాచానికి క్రయుధనం చెల్లించ కుడానే వునలను పాపదాన్యంనుండి విడిపించాడు. యూవే ఫరోను లాగే, క్రీస్తు పిశాచాన్ని నాశం చేసాడు. ప్రభువు మనలను విమోచించినందుకు, అనగా పిశాచ దాస్యం నుండి విడిపించినందుకు, మనం ఎల్లప్పడూ అతనికి కృతజ్ఞలమై వుండాలి.

6. విశ్వాసులకు స్వేచ్చనీయడం

గ్రీకు రోమను ప్రజలు స్వేచ్ఛాప్రియులు. వారిసమాజంలో బానిసలకు స్వేచ్ఛలేదు. మిగతా పౌరులకు స్వేచ్ఛ వుండేది. స్వేచ్ఛగల పౌరులు గొప్పవాళ్లు. గ్రీకులో స్వేచ్ఛకు "ఎలుతేరియా" అని పేరు.