ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజల పాపాలవలన గుడారం, మందసం, కరుణా ఫలకం మొదలైన పవిత్రవసువులు మైలపడిపోయాయి. వాటిని మళ్లా పవిత్రపరచి దేవునికి అర్పించాలి. వాటిని శుద్ధిచేస్తే ప్రజలను గూడ వారిపాపలనుండి శుద్ధిచేసినట్లే. ఇక వాటిని శుద్ధిచేయడం ఏలాగ? వాటిమినాద పశువుల నెత్తురు చిలకరించడం ద్వారానే. కాని నెత్తురు వస్తువులను ఏలా శుద్ధిచేస్తుంది?

హీబ్రూ ప్రజల భావాల ప్రకారం ప్రతిప్రాణి ప్రాణం నెత్తురులో వుంటుంది - లేవీ 17, 14. నెత్తురు ఊపిరి, జీవం. ఇక, నెత్తురులోని ప్రాణం దేవుని నుండి వచ్చిందే. అనగా నెత్తురు దైవసాన్నిధ్యం కలది. కనుక అది వస్తువులనుగాని నరులనుగాని శుద్ధిచేయగలదు. బలిలో సమర్పించే నెత్తుటికి ఈ శక్తి అధికంగా వుంటుంది. కరుణా ఫలకాన్ని శుద్ధిచేయడం ద్వారా ప్రజలను గూడ వారి పాపలనుండి శుద్ధి చేసినట్లవుతుంది. ఇది సాంకేతిక కార్యం.

పౌలు ఈ భావాలను క్రీస్తుకి అన్వయించాడు -రోమా 3.25. తండ్రి సిలువపై వ్రేలాడే క్రీస్తు దేహాన్ని కరుణా ఫలకం జేసాడు. దానిపై చిలకరించిన నెత్తురు క్రీస్తు నెత్తురే. సిలువపై వ్రేలాడుతూ నెతురులు ఒలుకుతున్న క్రీసుదేహం జంతువుల నెతురులో తడిసివున్న కరుణా ఫలకంలా వుందని పౌలు భావం. క్రీసు చిందించిన నెత్తురుద్వారా, దానిలోని దైవ సాన్నిధ్యం వలన నరుల పాపాలు పరిహారమయ్యాయి. పాపపు నరులు మళ్లా దేవునికి సమర్పితులై అతనితో ఐక్యమయ్యారు. ఈలా క్రీస్తు మన కొరకు కరుణా ఫలకంగా తయారై మన పాపలకు ప్రాయశ్చిత్తం చేసాడు. ప్రాయశ్చిత్త కర్మనరుల పాపాలను తొలగించి వారిని మళ్లా దేవునితో ఐక్యపరుస్తుంది.

సిలువ మరణంలో తండ్రి ప్రేమ, క్రీస్తుప్రేమ స్పష్టంగా