ఈ పుట ఆమోదించబడ్డది

భూస్థాపనం, ఉత్థానం, మోక్షారోహణం, మోక్షక్రీస్తు ప్రార్ధనం. పౌలు క్రీసు జీవితంలోని ఈ సంఫుటనలు అన్నిటినీ ప్రజలకు బోధించాడు. అవే యిప్పడు మనకు రక్షణను చేకూర్చి పెట్టేది.

పౌలు ఈ సువార్తను బోధించే సేవకుడు-ఫిలి 2,22. అతడు యిర్మీయా మొదలైన పూర్వప్రవక్తల్లాగ సువార్త బోధకై ప్రత్యేకింపబడిన వాడు-గల 1,15, రోమా 1,1. సువార్తను బోధించే భారం క్రీస్తు అతనిమిద మోపాడు - 1కొరి 9,16. అతని దృష్టిలో సువార్తబోధ యాజకుడు దేవళంలో నిర్వహించే దైవార్చనలాంటిది. అనగా గురువు పూజబలిని సమర్పించడం లాంటిదని భావం. అతడు తన సువార్త బోధ ద్వారా అన్యజాతి ప్రజలనే బలిని దేవునికి సమర్పించాడు - రోమా 15,16. ఆలాంటి పవిత్రమైన సువార్త సేవను గూర్చి అతడు ఏనాడు సిగుపడలేదు - రోమా 1,16. అతడు దేవుని రహస్యసత్యాలను ప్రజలకు పంచిపెట్టే గృహనిర్వాహకుడు - 1కొరి 4,1. ప్రజలు ఈ సువార్త సందేశాన్ని ఆహ్వానించాలి, శ్రద్ధతో వినాలి, దానికి విధేయులు కావాలి - రోమా 1,5. ఈ సువార్త ఎల్లరికి రక్షణనిచ్చే దేవుని శక్తి - రోమా 1,16. నరులు విశ్వసిస్తే చాలు అది యూదులనైనా అన్యులనైనా రక్షించగలదు. యెరూషలేము సమాజానికి మూల స్తంభాలైన పేతురు యాకోబు యోహానులు దేవుడు పౌలుకి ఒసగిన ఈ సువార్త సేవావరాన్ని గుర్తించారు -గల 2.9. పౌలు ఈ సువార్తను ప్రకటించడమే తన జీవితధ్యేయంగా పెట్టుకొన్నాడు.

ఈ సువార్తనే పౌలు దైవరహస్యం లేక రక్షణ ప్రణాళిక అని పిలుస్తుంటాడు (Mystery). రోమా 16,25-26, కోలో 1,25-27, ఎఫె 3,12 ఆలోకనాలు పరిశీలిస్తే ఈ రహస్య ప్రణాళికలోని లక్షణాలు బోధపడతాయి. అవి యివి. పూర్వమే (27)