ఈ పుట ఆమోదించబడ్డది

కరుణాఫలకంలాగ సిలువపై ప్రదర్శించాడు -రోమా 3.25. అనగా క్రీస్తు సిలువపై తన రక్తాన్ని చిందించి మనకు పాపపరిహారం చేసి పెట్టాడు. చనిపోయిన క్రీస్తుని ఉత్థానం చేసింది తండ్రే-1 తెస్స 1,10. తండ్రి క్రీసు మరణం ద్వారా నరులందరినీ తనతో రాజీపరచుకొన్నాడు - 2కొరి 5,19. మనం పాపులమై యుండగా క్రీస్తు మనకొరకు చనిపోయాడు అంటే దేవునికి మనపట్ల ఎంత ప్రేమవుందో విశదమా"తుంది -రోమా 5,8. ఈ యూలోకనాలను బట్టి రక్షణం మొదట తండ్రినుండి కలిగింది అనుకోవాలి. ఈ తండ్రికి పౌలు మోకరిల్లి నమస్కారం చేసాడు - ఎఫె 3,14.

పౌలు తన జాబుల్లో దేవుని రహస్య ప్రణాళికను గూర్చి మాటలాడుతుంటాడు - ఎఫె 3,3-4. తండ్రి క్రీస్తుద్వారా పాపులైన నరులను రక్షించాలని సంకల్పించుకోవడమే ఈ రహస్య ప్రణాళిక. ఈ ప్రణాళిక క్రీస్తు రాకపూర్వం కొందరు భక్తులకు మాత్రమే తెలుసు. దేవుడు దాన్ని క్రీస్తు మరణోత్థానాలకాలం వరకు రహస్యంగా దాచివుంచాడు. ఇప్పడు డమస్కు దర్శనంవల్ల పౌలు ఈ ప్రణాళికను లోతుగా అర్థంచేసికొన్నాడు. క్రీస్తుద్వారా మనకు పాపపరిహారమూ సంపూర్ణ రక్షణమూ లభించాయని తెలిసికొన్నాడు - రోమా 16,25–26.

పౌలు సువార్త

పౌలు తరచుగా తాను బోధించే సువార్తను గూర్చి మాటలాడుతూంటాడు. అది క్రీస్తును గూర్చిన సువార్త. తాను దాన్ని బోధించాడు కనుక కొన్ని పర్యాయాలు దాన్ని "నా సువార్త" అని కూడ చెప్నంటాడు-రోమా 2,16. ఈ సువార్త అంతా క్రీస్తుని గూర్చే దానిలో ఆరు అంశాలు వున్నాయి. అవి క్రీస్తు శ్రమలు, మరణం,