ఈ పుట ఆమోదించబడ్డది

పోలిస్తే అతనికి లోకంలోని వసువులన్నీ పెంటప్రోవులాగ విలువలేనివి అన్పించాయి - ఫిలి 3,8.

4. ప్రభువు అతన్ని యూదులకూ అన్యజాతులకూ గూడ తన్ను బోధించమని ఆజ్ఞాపించాడు -అచ 9,15. అతని పిలుపు యిర్మీయా ప్రవక్త పిలుపు లాంటిది-యిర్మీ 1,5. బాధామయ సేవకుని పిలుపు లాంటిది - యొష 49,1.

5. డమస్కు పిలుపు పౌలుని బాగా ప్రభావితం చేసింది. అది మోషే పిలువులాంటిది. అతని ప్రేషిత సేవకు ప్రేరణం ఈ పిలుపునుండే వచ్చింది. ఆ సేవలో అతనికి ఎదురైన కష్టాలను అనుభవించే శక్తి కూడ ఈ పిలుపునుండే వచ్చింది. దైవానుభూతి చెందిన నరులు ఆ దేవుని కొరకు మహాకార్యాలు సాధిస్తారు. మన పిలుపులో డమస్కు దర్శనం లాంటి లక్షణం ఏదైన వుందేమో పరిశీలించిచూచుకొందాం.

4. రక్షణప్రణాళిక తండ్రినుండే

మనం మామూలుగా క్రీస్తు మనలను రక్షించాడు అంటాం. కాని క్రీస్తు తనంతటతాను రాలేదు. తండ్రి పంపగా వచ్చాడు. ఆదాము పాపంవలన నాశమైపోయిన నరజాతిని రక్షించాలని కోరుకొందీ, ఆ రక్షణం రెండవ వ్యక్తియైన సుతునిద్వారా జరగాలని నిర్ణయించిందీ తండ్రి. ఆ తండ్రి నిర్ణయం ప్రకారం సుతుడు యేసుగా జన్మించి మనలను రక్షించాడు. కనుక రక్షణ చరిత్రను పరిశీలించేటప్పడు తండ్రి ప్రాముఖ్యాన్ని గూడ గూర్తించాలి. పౌలు తన జాబుల్లో ఈ తండ్రిని పదేపదే పేర్కొంటూంటాడు.

కాలం పరిపక్వమైననపుడు దేవుడు మానవులను రక్షించడానికి తన కుమారుని_ప్తంపాడు - గల 4,4. అతన్ని