ఈ పుట ఆమోదించబడ్డది

9. యూవే ప్రభువు మొదటిసారి వెలుగును కలిగించాడు -ఆది 1,3. అతడు మళ్లా రెండవసారి వెలుగును పుట్టించాడు. ఆ రెండవ వెలుగు ఉత్థానక్రీస్తు రూపంలో పౌలుపై సోకింది. అతడు నూత్ననరుడు అయ్యాడు. ఇదే డమస్కు దర్శనం భావం - 2కొరి 4,6.

10. డమస్కు దర్శనం ద్వారా పౌలు అపోస్తలుల వర్గానికి చెందినవాడు అయ్యాడు. ఉత్థాన క్రీస్తుని దర్శించి వుండడం, అతనిచే వేదబోధకు పంపబడ్డం అపోస్తలుడి లక్షణాలు - 1కొరి 15.5-8. ఈ రెండు లక్షణాలు పౌలులో నెరవేరాయి.

డమస్కు దర్శనానికి ముందు పౌలు క్రైస్తవులను హింసించాడు. కాని ఆదర్శనంవల్ల తాను క్రీస్తు భక్తుడై అతన్ని బోధించాడు. అందుచే యూదులు అతన్ని హింసించారు. అనగా హింసకుడు మార్పుచెంది హింసితుడు అయ్యాడు - అచ 9,23-30,

ఇక యీ దర్శనంలో కొన్ని వ్యక్తిగతమైన అంశాలు కూడ వున్నాయి. అవి యివి.

1. పౌలు తనకు ఈలాంటి దర్శనం కలుగుతుందని ముందుగా ఊహించలేదు. అతడు క్రైస్తవులను మటుపెట్టే ప్రయత్నంలో వున్నాడు. దిడీలున క్రీస్తు దర్శనం కలిగింది. మనం ఊహించనపుడు భగవంతుని సహాయం లభిస్తుంది.

2. ఒకవైపు పౌలు క్రైస్తవులను వేటాడుతున్నాడు. మరోవైపు క్రీస్తు పౌలుని వేటాడుతున్నాడు. వేట వేటగానికి చిక్కినట్లుగా పౌలు క్రీస్తుకి చిక్కాడు - ఫిలి 3,12.

3. క్రీస్తుని హింసించేవాడు క్రీస్తు భక్తుడు అయ్యాడు. అతడు కొన్ని సిద్ధాంతాల పట్లగాక, క్రీస్తు అనే వ్యక్తి పట్ల ఆకర్షితుడు అయ్యాడు. అతనికి ప్రేరణం పుట్టించింది ఉత్థాన క్రీస్తు. ఆ క్రీస్తుతో