ఈ పుట ఆమోదించబడ్డది

6. ఉత్థాన క్రీస్తు సౌలూ నీవు నన్నెందుకు హింసిస్తున్నావని ప్రశ్నించాడు-అచ 9, 4. అతడు హింసించింది క్రైస్తవులని. కనుక క్రీస్తు క్రైస్తవ సమాజంలో నెలకొని వున్నాడని పౌలు గ్రహించాడు. క్రైస్తవ సమాజం (తిరుసభ) క్రీసుదేహం అని వ్రాసాడు. ఇక్కడ "దేహం" అంటే వ్యక్తి. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన వాళ్లంతా అతనితో ఐక్యమై అతనితో పాటు ఏకవ్యక్తిగా తయారౌతారు. ఇదే జ్ఞానశరీరం. ఈ శరీరానికి క్రీస్తు శిరస్సు, విశ్వాసులంతా అవయవాలు. ఇది పాలు బోధల్లో ఓ ముఖ్యాంశం.

7. రక్షణ చరిత్రలో మూడు దశలున్నాయి. మొదటిదశ, అబ్రాహామునుండి మోషే వరకు. ఈ దశలో ధర్మశాస్రం లేదు. అంతరాత్మ హెచ్చరికల ప్రకారం జీవించినవాళ్లంతా రక్షణాన్ని పొందారు. రెండవదశ, మోషేకాలం నుండి మెస్సీయా వచ్చేవరకు. ఈ దశలో ధర్మశాస్ర నియమాలను పాటించినవాళ్లు రక్షణం పొందారు. మూడవదశ మెస్సీయా కాలంనుండి లోకాంతం వరకు. ఈ దశలో మెస్సీయా ఆజ్ఞలను పాటించినవాళ్లు రక్షణం పొందుతారు. పౌలు మొదట్లో ఈ మూడవదశ ఎప్పడో భవిష్యత్తులో వస్తుంది అనుకొన్నాడు. కాని డమస్కు దర్శనం వల్ల ఈ మూడవ దశ క్రీస్తు ఉత్థానంతోనే ప్రారంభమైందని గ్రహించాడు. కనుక తాను అవశ్యం క్రీస్తుని బోధించాలి. యూదులూ అన్యజాతి ప్రజలూ కూడ అతన్ని విశ్వసించేలా చేయాలి. అందుకే సువార్తను బోధించకపోతే నా పరిస్థితి దారుణమాతుంది అని వ్రాసాడు-1కొరి 9,16.

8. పూర్వ నూత్న వేదాల కు నంబంధం వుంది. పూర్వవేదంలోని యావే ప్రభువే ఇప్పడు క్రీస్తు ద్వారా రక్షణాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆ తండ్రీకుమారులను విడదీయకూడదు. వాళ్లిద్దరు కలిసే పనిచేస్తారు.