ఈ పుట ఆమోదించబడ్డది

3. సైఫను క్రీస్తు దేవాలయాన్ని నాశం జేస్తాడనీ, ధర్మశాస్రాన్ని మార్చివేస్తాడనీ బోధించాడు-అచ 6,14. దేవాలయం ధర్మశాస్త్రం యూదులకు పరమపవిత్రమైనవి. ఈలాంటి బోధలు చేసే క్రైస్తవులను అడపొడ కానరాకుండా చేయాలి.

4. యూదులు మెస్సియా మహిమప్రతాపాలతో వచ్చి లోకాన్ని జయించి యూదసామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు అనుకొన్నారు. కాని క్రీస్తు నీచాతినీచమైన సిలువ మరణాన్ని అనుభవించాడు. అతడు మెస్సియా కాలేడు. కనుక క్రైస్తవులది అసత్య ప్రచారం.

ఈలాంటి భావాలతో పౌలు విశ్వాసులను హింసించాడు. అతడు ధర్మశాస్త్రం పట్ల నిష్ట అభినివేశం కలవాడు. కనుక క్రైస్తవులను హింసించడంవల్ల తాను దేవునికి ప్రీతి కలిగిస్తున్నాను అనుకొన్నాడు - అచ 8,3.

డమస్కు దర్శనం వల్ల పౌలుకి చాలా నూత్నాంశాలు లోతైన భావాలు తట్టాయి. ఇక్కడ కొన్నిటిని పరిశీలిద్దాం.

1. యేను వెుస్సీయూ, ప్రభువు. యూవే ప్రభువుకి సరిసమానం. అతడు నరులకు పవిత్రాత్మను దయచేసేవాడు -అచ 9,17. వారి పాపాలను నిర్మూలించేవాడు-22,16. ఈ క్రియలను దేవుడు మాత్రమే చేయగలడు. కనుక అతడు దేవునికి సరిసమానం. అందుకే పౌలు అతనికి 'ప్రభువు" అన్న బిరుదాన్ని తరచుగా వాడుతూంటాడు. 2. యూదులు మెస్సియా కొని వచ్చే నూత్నయుగం కొరకు ఎదురు చూసున్నారు. ఆ యుగంలో వెుస్సీయూ పాపాన్నీ మృత్యువునీ తొలగించి సకల సౌభాగ్యాలు చేకూర్చి పెడతాడు అనుకొన్నారు. పౌలు క్రీస్తు ఉత్థానంతో ఈ నూత్నయుగం ప్రారంభ మైందని గుర్తించాడు. కనుకనేయుగాంతం ఆసన్నమైందని వ్రాసాడు - 1కొరి 10,11. L