ఈ పుట ఆమోదించబడ్డది

వ్యాపార కేంద్రం. ఆరోజుల్లో ఇక్కడ విశ్వవిద్యాలయం వుండేది. స్టోయిక్ శాఖకు చెందిన గ్రీకు తాత్వికులు వుండేవాళ్లు. పాలు వూతృభాష అరమాయిక్ ఐనా గ్రీకు భాషను క్షుణ్ణంగా నేర్చుకొన్నాడు. అతనికి గ్రీకు వక్తృత్వకళలో ప్రావీణ్యం వుంది. అతడు కొన్నిసారు 'డియాట్రిబ్' అనే స్టోయిక్ వక్తృత్వ విధానాన్ని వాడుతుంటాడు. ఓ ప్రత్యర్డిని ఊహించు కుని అతనితో వాదిస్తున్నట్లుగా వ్రాయడమే ఈ విధానం. పౌలు తన ఆతెన్సు ఉపన్యాసంలో గ్రీకు కవులను గూడ ఉదాహరించాడు-అచ17,28. క్రీస్తు తన బోధల్లో గలిలీ రాష్ట్రపు వ్యవసాయానికి చెందిన పదాలు భావాలు వాడాడు. పొలం-విత్తనాలు, పూలు, చేపలు పట్టడం మొదలైనవి అతని పదాలు. పౌలు గ్రీకు పట్టణసంస్కృతికి చెందిన భావాలు వాడాడు. క్రీడలు, న్యాయశాస్రం, వ్యాపారశాస్రం, సదుణాలు, అంతరాత్మ మొదలైన భావాలు అతని జాబుల్లో వస్తాయి. అతని జాబుల చివరలో వచ్చే నీతిబోధలు స్టోయిక్ తాత్వికుల బోధలను తలపిస్తుంటాయి. పౌలు గ్రీకు ప్రజలకు క్రీస్తుని బోధించాలి. పేత్రు యూదులకులాగే అతడు అన్యజాతివారికి ప్రేషితుడు-గల 2.7. కనుక భగవంతుడు అతనికి ముందుగనే గ్రీకు భాషతోను సంస్కృతితోను పరిచయం కలిగేలా చేసాడు. అతడు తన జాబుల్లో వాడింది కోయినే అనబడే వ్యావహారిక గ్రీకుభాష.

3. డమస్కు దర్శనం

పౌలు యెరూషలేములోని క్రైస్తవులను బాధించాడు. డమస్కులోని విశ్వాసులను గూడ హింసించడానికి ఆ పట్టణానికి వెళ్తున్నాడు. ఆ రెండు నగరాలకు మధ్యదూరం 140 మైళ్లు. అది