ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు భక్తుడు. ఉత్థాన క్రీస్తే అతనికి ప్రేరణం పుట్టించాడు. అతని విజయరహస్యం ఇక్కడే వుంది. పౌలు క్రీస్తుతో ఐక్యం చెందిన ద్రష్ట. దైవరహస్యాలు గ్రహించిన తాత్వికుడు. నేటికీ క్రైస్తవ ప్రపంచంలో అతన్ని మించిన వేదాంతి లేడు. యోగి, సర్వసంగ పరిత్యాగి. తన శరీరాన్ని నలగగొట్టి అదుపులోకి తెచ్చుకొన్నవాడు -1కొరి, 9,27.

క్రీస్తుపట్ల గాఢమైన భక్తివున్నా పౌలుకి మతమా ఢ్యం లేదు. అతడు తన భావాలు మాత్రమే ఆచరణీయమైనవి అనుకోలేదు. మంచి యొక్కడవున్నా స్వీకరించమన్నాడు -ఫిలి 4,8.

అతడు క్రీస్తుని సన్నిహితంగా అనుసరించాడు. ఆ ప్రభువు మరణోత్థానాలను తన జీవితంలోగూడ అనుభవించి దివ్యశక్తిని పొందాడు. తాను క్రీస్తుని అనుసరించినట్లే తన సమాజాల్లోని విశ్వాసులు కూడ తన్ను అనుసరించాలని కోరుకొన్నాడు - 1కొరి 11,1. అతని లేఖలు ఇప్పడూ మనలను ప్రభావితం చేస్తున్నాయి. కాని ఆ లేఖలను మించింది అతని జీవితాదర్శం. ఆ యాదర్శం నేడు మనలను కూడ కదిలించాలి.

5. పౌలు ప్రాముఖ్యం

1. తొలినాటి క్రైస్తవులు పౌలు జాబుల విలువను గుర్తించి వాటిని సేకరించుకొని మక్కువతో చదువుకొన్నారు. ప్రాచీన వేదశాస్రులు అందరు ఈ లేఖలమివాద వ్యాఖ్యలు వ్రాసారు. ఇప్పటి మన దైవశాస్త్రంలోని అనేకాంశాలను పౌలే మొట్టమొదటిసారిగా వెలిబుచ్చాడు. అతడు బోధించిన వేదసత్యాలు విశ్వాసులను ఎల్లకాలం ఉత్తేజపరుసూనే వుంటాయి.

2. అతడు క్రీస్తుని యూదుల పరిధినుండి తప్పించి