ఈ పుట ఆమోదించబడ్డది

అనుచరులకు అతనిపట్ల అపారగెరవం ప్రేమ వుండేవి. అతడు వారిని ఆదరంతో "తోడిపనివాళ్లు"అని పేర్కొనేవాడు. రోమా పౌరుల లేఖ 16వ అధ్యాయం ఈలాంటి పనివాళ్లను 27మందిని పేర్కొంటుంది. దీన్నిబట్టే పాలు స్నేహస్వభావాన్ని అర్థంజేసికోవచ్చు. అతడు తన్ను తల్లితో తండ్రితో, దాదితో పోల్చుకొన్నాడు. ఐనా పౌలుకి చాలమంది విరోధులు కూడ వున్నారు. యూదులు, క్రైస్తవ యూదులు కూడ అతనికి శత్రువులు. అతడు మాత్రం వారిపట్ల గూడ ఉదాత్తంగానే మెలిగాడు.

పౌలు జీవితంలో చాల ఫురణలు వున్నాయి. అతడు గ్రీకుయూద సంస్కృతులు రెండిటినీ జీర్ణంచేసికొన్నవాడు. ఈ రెండిటికీ ఘర్షణం వుండేది. ఇంకా తన జీవితంలోను తోడి క్రైస్తవుల జీవితాల్లోను గూడ మంచిచెడుల మధ్య, శరీరం ఆత్మల మధ్య, విశ్వాసం సత్ర్కియలమధ్య ఘర్షణ చూచాడు. అతని ప్రేషిత సేవలో కూడ నిరంతరం పోరాటాలు ఎదరయ్యేవి. ఇన్ని ఆటుపోటులు ఎదురైనా అతని హృదయం మాత్రం శాంతితో నిండివుండేది. దేవుణ్ణి ప్రేమించే వాళ్లకు అన్ని సంఘటనలు మంచినే చేసిపెడతాయి అని అతని నమ్మకం - రోమా 8,28. క్రీస్తు ప్రేమనుండి ఏశక్తీ తన్ను వేరుపరచలేదని అతని విశ్వాసం - రోమా 6,35.

అతడు క్రీస్తుసేవలో ఎన్నో శ్రమలు అనుభవించాడు - 2కొరి 11,23-29. క్రీస్తు తిరుసభ కొరకు పడిన బాధల్లో వున్న కొదవను తన శ్రమల ద్వారా తీర్చాడు - కొలో 1,24.

పౌలు సహజజానం వల్లనే క్రీస్తు మరణోత్థానాలశక్తినీ, ఉత్థాన క్రీస్తు క్రైస్తవులను ప్రభావితంజేసే తీరునూ గ్రహించాడు. అతనికి క్రీస్తే ముఖ్యం. "క్రీస్తునందు" అనేది అతని మంత్రం. క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు అనేది అతని పదం. అతడు క్రీస్తు దాసుడు,