ఈ పుట ఆమోదించబడ్డది

చాల తావుల్లో "అల్పాక్షరాల్లో అనల్పార్థరచన" అనే లక్షణం కన్పిస్తుంది. క్రైస్తవ విశ్వాసాన్ని ఓ క్రమ పద్ధతిలో వివరించడం పౌలు ఉద్దేశంకాదు. కేవలం ఆయా అవసరాలను పురస్కరించుకొని అతడు జాబులు వ్రాసాడు. ఒక్కోజాబులో అప్పటికప్పడు అవసరమైన వేదసత్యాలను మాత్రమే వివరించాడు. అందుచే అతని లేఖల్లో నేటి మన దైవశాస్ర గ్రంథాల్లోలాగ ఓ క్రమపద్ధతి గోచరించదు. కాని అతడు ఎత్తుకొన్న విషయాలను మాత్రం ఎవరూ చెప్పలేనంత లోతుగా చెప్పాడు.

4. పౌలు వ్యక్తిత్వం


పౌలు జాబులనుండీ అపోస్తుల చర్యలనుండీ అతని వ్యక్తిత్వాన్ని కొంతవరకు గ్రహించవచ్చు. అతడు గొప్ప ఉత్సాహశక్తి, కార్యదీక్ష, అంకిత భావం, విజయకాంక్ష గల నాయకుడు. అతని పటుదలకు అంతులేదు. 30 ఏండ్ల పొడుగున నిర్విరామంగా కృషిజేసూ పోయాడు. యూదుడుగా వున్నపుడు ధర్మశాస్తాన్ని మక్కువతో పాటించాడు. క్రైస్తవులను ఘతోరంగా హింసించాడు. క్రైస్తవుడు అయ్యాక నిద్రాహారాలు గూడ మాని నానా ప్రదేశాల్లో క్రీస్తుని బోధించాడు. బర్నబాని పేతురునిగూడ ఎదిరించాడంటే అతని ధైర్యాన్ని మెచ్చుకోవాలి.


ధైర్యం పటుదలగల నాయకుడైన పౌలులో మొత్తదనం గూడ లేకపోలేదు. కష్టాలు, శత్రువులు ఎదురైనపుడు ఉద్వేగాలకు గురయ్యేవాడు. భయం, బలహీనత, నిరుత్సాహభావాలు అతన్ని క్రుంగదీసేవి -1కొరి 23. 2కొరి 18. ఐనా ఆత్మప్రేరణంతో మళ్లా ఉత్సాహం తెచ్చుకొనేవాడు.