ఈ పుట ఆమోదించబడ్డది

చెప్నండగా కార్యదర్శులు వ్రాసి వుంటారు. నూత్న వేదంలోని సువిశేషాలకంటె ముందుగా పౌలు రచనలే క్రైస్తవ సమాజాల్లో ప్రచారంలోకి వచ్చాయి. తొలిరోజుల్లోనే విశ్వాసులు పౌలు జాబుల సంకలనాలను తయారుచేసికొన్నారు.

ఈ లేఖల్లో క్రీసు పట్ల పౌలుకున్న గాఢమైన భక్తి అడుగడుగునా కన్పిస్తుంది. సాహిత్య దృష్ట్యా కాదుగాని భక్తి విశ్వాసాల దృష్ట్యా ఈ లేఖలు పలుసార్లు చదవదగినవి. "క్రీస్తునందు" అనేది అతని ప్రధాన భావం. భక్తుడు క్రీస్తుతో ఐక్యంగావాలి అనేది అతని ముఖ్యబోధ. ఈ యైక్యతనుగూర్చి వ్రాసేపుడు అతడు గ్రీకు భాషలో నూత్న పదాలనుగూడ సృష్టించాడు. అతని రచనల్లో శక్తి, వేగం, గాఢమైన ఉద్వేగాలు కన్పిస్తాయి.

అతడు గ్రీకుభాషలో వ్రాసినా యూదుడుగానే ఆలోచిం చాడు. అతని భావాలకు ఆధారం పూర్వావేదం. శరీరం, మనస్సు, ఆత్మ మొదలైన పదాలకు అతడు ఇచ్చేది గ్రీకు అర్థాలు కావు, హిబ్రూ అర్థాలు. పౌలు దృష్టిలో పూర్వవేదానికి సార్ధక్యం క్రీస్తే, ఈ క్రీస్తుని గూర్చి వ్రాయడం, బోధించడం అతని ధ్యేయం. అతడు క్రైస్తవ బోధకుడుగా వూరిన యూదరబ్బయి. కనుక అతని భావాలు, శైలి, ప్రత్యర్దితో వాదం చేసినటుగా వ్రాయడం మొదలైనవి అచ్చంగా రబ్బయుల పద్ధతిలోనే వుంటాయి.

అతడు వాడింది హిబ్రూ బైబులు కాదు, సెప్టువాజింత్ గ్రీకు అనువాదం. అతని గ్రీకు భాషకూడా ఈ సెప్టువాజింత్ గ్రీకుకు దగ్గరగానే వుంటుంది. అతని గ్రీకులో అక్కడక్కడ వ్యాకరణానికి లొంగని ప్రయోగాలు కన్పిస్తాయి. కొన్నిచోట్ల వాక్యాలు ముగియకుండ అర్థాంతరంగానే ఆగిపోతాయి. అతని రచనల్లో భావనాశక్తి కంటె బుద్ధిశక్తి ఎక్కువ లోతుతనం మెండు. కనుక