ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రవేశిక

అనంతములైన నామరూపములతో విలసితమైన విశ్వము శాస్త్ర కళారూపమున విజ్ఞానమగుచున్నది. విశ్వవిజ్ఞానవికాశము చతుర్విధపురుషార్ధరూపమైన మానవధర్మాభ్యదయమునకు సాధనముగ నున్నది. పంచవింశతి తత్వపరిణామమైన విశ్వవిజ్ఞాన మనంత ములైన శాస్త్రకళారూపములను బోద్యమగుచున్నది. మానవులు శాస్త్రకళా విజ్ఞానమును బడయుటకు చేసిన పరిశ్రమ ప్రపంచపరిణామమునందు దివ్యాధ్యా యము. వైదికయుగమునందు, సుప్రసిద్దములైన చతుర్ధశ విద్యలు, చతుష్టష్టికళలు వర్తమానయుగము నందు అనేకశస్త్రకళాపరిణామము పొందిన విధమును బహువిధశాస్త్రములు కళలు విశదము చేయుచున్నవి. బ్రహ్మాండవ్యాప్తమైన జీవజాలములు, బూతములు, గ్రహములు, తారాగణనక్షత్రములు, శక్తులు ప్రపంచకళ్యాణమునకు వినియొగపడుచున్న విధమ్మును సువ్యక్తముచేసిన శాస్త్రజ్ఞలు, కళాభిజ్నులు, తత్త్వజ్నులు, యోగులు, జ్ఞానులు, సిద్ధులు లోకారాధ్యులు, వ్యక్తులకు, కుటుంబములకు, కులములకు, జాతులకు మహత్త్వమునకు సాహిత్యకళాభ్యుదయమే ప్రమాణము. సాహిత్యకళాభ్యుదయముల్?ఏని ప్రాకృతజాలులు తాము తరించుటకును, ఇతరులను తరింపజేయుటకును నిరర్ధకములు.

   ప్రాచీనకాలమునందు మానవులు శాస్త్రవిజ్ఞాతల గౌరవించిన విధమును మతములు, తంత్రములు, యోగాగమనులు మొదలగు విద్యలు విశదము చేయుచున్నవి. వర్తమానయుగమునందు శాస్త్ర