పుట:Parama yaugi vilaasamu (1928).pdf/212

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

197


నేల కొంకెదరు మీ రిప్పు డేకాంత
మేల యిచ్చటఁ బరు లెవ్వ రున్నారు
తప్పక యెఱిఁగింపఁదగినకార్యంబుఁ
జెప్పుడా యనవుడు క్షితిపాలుఁ జూచి
వెఱచి విన్నపముఁ గావింతుమో లేక
వెఱవ కిప్పుడు విన్నవింతుమో మీర
లైన నోడకుఁ డని యానతిచ్చితిరి
కానఁ దెల్పెదము తత్క్రమ మెట్టి దనిన
నేకొఱంతయు లేక యీధరాచక్ర
మేకచక్రంబుగా నేలుభూపతివి
బొక్కసభండారములు వానిలెక్క
పొక్కలు మఱియు యిన్పుగనగరికిని
నిలువ పూజ్యముగ మన్నీలు చెల్లింప
వలసిననిల్వ సల్వలు విరాడములు
సరవి గానుక [1]దేవసంబు ధాస్యంబు
వరసియు గాది[2]దిపావళు లందు
పగిదిఁ జెల్లించు నప్పగిది రాహుతుల
నగరిబంటులజీతనాతంబు లేలు
కరుల గుఱ్ఱముల దుర్గపుసవరణలఁ
బరివారముల భూమిపతుల పౌంజులను


  1. దవసంబు
  2. దీపావళులందు