పుట:Parama yaugi vilaasamu (1928).pdf/166

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

151


దేఁకువఁ గనిపించుతెఱవలఁ జూచి
యేఁకటఁ బడఁజేసె నిట్లు దైవంబు
మఱియును నేము నిమ్మహిఁ బుట్టి బుద్ధి
యెఱిఁగితి మీరీతి యెఱుఁగ మెన్నండు
కరమునం గని పెంచువారలు లేరె
వర మైన నిటువంటివర మెందుఁ గలదు
కురుకాధినాథు మక్కువఁ గోరి వేఁడఁ
గరుణించి వర మిచ్చెఁ గడు[1] సీగరముగ
నిచ్చెఁ బో యిందఱ కిచ్చినరీతి
నిచ్చెనా తుది వచ్చి యిది కొంత సేసెఁ
దలఁపఁ బిడ్డఁడె వీఁడు దయ్యంబు గాక
పలుమాఱు నీరీతి[2] బలుపుకో నేల
నని పుత్త్రవాత్సల్య మంతంతఁ బొదలఁ
దనవారిదెసఁ గాంచి తనయునింజూచి
యేను నీకై నోము లెన్నేని నోఁచి
[3]పైనాఁకపాటులఁ బడి గొడ్డువీఁగి
కంటి నీవంటి చక్కనిముద్దుగుఱ్ఱ
నంటు సేయవు కేరి నవ్వ వేమిటికి
నీసున మీతండ్రి యేనును నీకుఁ
జేసిన యెగ్గేమి చెప్పుమా తండ్రి !


  1. శేఖరముగ
  2. బలుముకో.
  3. పానాకపాటుల.