ఈ పుటను అచ్చుదిద్దలేదు
దేహమే అయితే మన యిద్దరి దేహాలు అన్నమయాలే కదా! చైతన్యమే అయితే మన యిద్దరి యందును ఉన్నది ఒకే చైతన్యం కదా! అన్నాడు. ఆ మాటలతొ శంకరుడు ప్రబుద్ధుడయినాడు. అ ఉదుటులో కొన్ని శ్లోకాలు చెప్పాడు. వాటిని మనీషా పంచక మంటారు.
ఆ శ్లోకాలు విని చండాలుడు విశ్వేశ్వరుడుగా ప్రత్యక్షమయ్యాడు. వేదవ్యాసుడు వ్రాసిన బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయమన్నాడు.
అప్పుడు శంకరుడు బదరికాశ్రమానికి వెళ్లి సూత్రభాష్వాది గ్రంధాలు వ్రాశాడు. అప్పటికి శంకరునికి పన్నెండో సంవత్సరం, సనందుడు మున్నగు శిష్యులకు వానిని మొదట భోధించాడు.
ఈ సందర్భంలో అతని శిష్యులలో కొంచెం పొరపొచ్చాలు పుట్టాయి. శంకరుడు సనందుని పట్ల ఎక్కువ అభిమానంతో ఉన్నాడనే అసూయ ఇతర శిష్యులకు కలిగింది. ఈ విషయం శంకరుడు తెలిసికొన్నాడు. సనందుని గురుభక్తిని మిగతా శిష్యులకు చూపించాలను కొన్నాడు. సనందుడు ఏటికి అవల ఉన్నాడు. మిగతా శిష్యులతో శంకరుడు ఇవతలి ఒడ్డున ఉన్నాడు. అప్పుడు శంకరుడు సనందుని ఇవతలకు రమ్మని పిలిచాడు. లోతునీరు ఎట్లారానని అనకుండా సనందుడు ముందుకు అడుగు వేస్తాడు. తోడనే నీతిలో నుంచి ఒక పెద్ద పద్మం పైకి లేచింది. సనందుడు దాని మీద ఒక అడుగు వేశాడు. దాని ముందు మరో పెద్ద పద్మం లెచింది. అట్లా పద్మాలు లేస్తూ ఉండగా వాటిమీద నడుచుకుంటూ సనందుడు గురువు వద్దకు వెళ్ళాడు. సనందుని ఈ అద్భుత మహిమను చూచి మిగతా శిష్యులు అతని పట్ల తమకు గల ఈసును మానారు. అప్పటి నుంచి సనందుడికి పద్మపాదుడనే పేరు వచ్చింది.
కొంతకాలానికి పిమ్మట శంకరుడు ఒకనాడు గంగాననదిలో స్నానం చేసి అహ్నికము చేసుకొని మణికర్ణికా ఘట్టంలో శిష్యులతో కలసి కూర్చుండి ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు. అతనికి శంకరునికి వ్యాస సూత్రార్ధాలను గుఱించి వారం రోజులు వదం జరిగింది. అప్పుడు పద్మపాదుడు తన గురువు వాదించ్చున్నది వ్యాసునితో అని గుర్తించి ఆ సంగరి బయట పెట్టెను. అప్పుడు శంకరుడు నా భాష్యము వ్యాస సమ్మతమేని వ్యాస భగవానుడు నాకు నిజరూపమును చూపునుగాక అని అన్నాడు. అంతట వ్యాసుడు సశిష్యుడుగా దర్శనమిచ్చాడు. అందుమీద