ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రతి సంవత్సరం అక్షయ తదియ నాటికి చమోలీనుండి బియ్యం పప్పులు, ఉప్పులు, సమస్త వస్తువులు బదరికి తీసుకుపొతారు.

     పాండుకేశ్వరములోని విగ్రహములను అక్షయ తదియ నాటికి బదరీతీసుకుపొతారు.  వైశాఖ శుద్ధ తదియ నాటికి ఉత్సవ విగ్రహాలన్ని బదరీలో చేరుతాయి.  అదే అక్షయ తదియ, సెప్టెంబరు మొదలు మే నెల వరకు బదరీలో జనులే ఉండరు.  అందుకనే ఆరునలలు దేవపూజ, ఆరుమాసాలు నరుల పూజ అంటారు.  అక్షతదియ నాడు పూజారి వేద ఘోషలతో ఆలయంలో ప్రవేశిస్తాడు.  ఆలయము ఎదుట అందరూ కూర్చుంటారు.  ఆరుమాసాల క్రిందటా సీళ్లు వేసిన తాళాలు యాత్రికులకు చూపిస్తారు.  అందరు చూస్తుండగానే సీళ్లు బ్రద్దలు కొట్టి తాళాలు తీస్తారు.  పూజారి తిన్నగా గర్భాలయములలోనికి వెళ్లి ఆరునలల నుండి వెలుగుచున్న అఖండ జ్యోతిని బయటికి తీసుకొని వస్తాడు.  ఆరునలల క్రిందట వెలిగించి పెట్టిన జ్యోతి అది అన్నాళ్లు ఎవరు ఎవసనదోయనక్కర లేకుండానే ఆరిపోక, కొడైనా కట్టక అలా వెలుగుతూనే యుంటుంది.  ఆ దీపం యాత్రికులందరు ఆ అఖందా జ్యోతిని దర్శిస్తారు.  దీనికే జ్యోతిర్ధర్శన మంటారు.  ఆదివ్య జ్యోతిర్ధర్శనార్దమే అష్టకష్టాలు పడి అక్షయతదియనాటి కక్కడికి వెళ్లడం.
    ఆ తరువాత ఆరు మాసాల క్రితం పూజ చేసిన పువ్వులు ఈవలకు తెస్తారు.  పూజ చేసిన వాడెలా ఉంటాయో ఆనాటికి కూడా పరిమళజ్ము చెడక వాడక పరాగభర భరితంబై ఉంటాయి.  ఆ పువ్వులు మంచులో వేసిన వస్తువులలాగే ఉంటాయి.  ఎన్నాళ్లైనా సరేయని సైంటిఫిక్కు సంర్ధన చేస్తారు.  మనవారు ఒప్పుకుందాం దీపం మాట యేం చెబుతారు ఎలా సమర్ధిస్తారు.  తలుపులు తాళాలు వేస్తారు.  ఆలయం మచుచే కప్పబది ఉంటుంది.  ఎలా వెలుగుతూంటుందో మరి ఆ దీపం."


          వైశాఖశుద్ధ పంచమి   శంకరజయంతి
     వైశాఖ?శుద్ధపంచమి తిధి యందు శంకరాచార్యులు అవతరించి నందున ఆనాడు శృంగేరి మున్నగు జగద్గురు పీఠములందు జయంత్యుత్సవాలుగా అనాదిగా జరుగుతూ వస్తున్నవి.
   కేరళదేశాన కాలడి అను అగ్రహారంలో విద్యాధిరాజు అనే పండితుడికి శివగురువు అను పేరు గల పుత్రుడు. ఆ శివ గురువు భార్య ఆర్యాంబ.