ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రాంతీయ జనులు ఈ కోండను అప్పన్న కొండ అనీ, ఇచట స్వామిని అప్పన్న అనీ అంటారు. శ్రీకాకుళం, విశాఖపట్టణము మండల ప్రాంతీయుల అప్పన్న పేరు ఎక్కువగా పెట్టుకుంటారు. ఈ గుడికి వచ్చే కోడె దూడలకు అచ్చుపోసి ఆపటెద్దులుగా వదులుతారు.

 దేవాలయం చాలా విశాలమైంది.  శిల్ప చాతుర్యం మెండు.  ఱాతి స్తంబాలమ్నీద ఆవరణలో శిలారధం కలదు.  గర్భగుడి విశాల రమ్యమైనది.  స్వామి విగ్రహం చుట్టూ ప్రదక్షిణం చేయడానికి జాగా బాగా ఉంది.  గంధం పూతతో స్వామి విగ్రహం ఇతర రోజుల్లో లింగాకారంగా కనిపిస్తుంది.
     శిలావిగ్రహాలు శాస్త్ర యుక్తంగా మలిచే విద్య ఇక్కడ ఇంకా బాగా ఉంది.  సింహాచలము సంపెంగ పూవులకు వామన చక్తకేళి అరటిపండ్లుకు, అనాసపండ్లుక్ ప్రసిద్ది.
    అన్నిటి కంటే అక్షయ తదియనాడు జరిగే చందన వేడుక యాత్రే ఇక్కడికి విశేషంగా యాత్రికులను ఆకర్షిస్తుంది.
                        గృహస్తులు : చందనచర్చ
    చందనాను లేపనం మంగళ ప్రదమైంది.  ఆరోగ్యప్రదమైంది.  చందనం అమూల్యమైన మూలిక.  ప్రియమైన వాసన కలిగి ఇది దుర్గంధాన్ని పోగొడుతుంది.  రక్తదోషాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది.  విషాహారంగా, క్రిమిహరంగా ఉంటుంది.  అంతస్తాపాన్ని పోగొట్టి మిక్కిలి చలవ చేస్తుంది.  ఆయుర్వేద వైద్యంలో దీనిని విరివిగా వాడతారు.  చందానాసవం, చందనాదివంటి మున్నగునవి తయారు చేస్తారు.
   చందనం నుండి చాందినీ అత్తరువు తయారు చేస్తారు.  సబ్బులూన్నూ చేస్తారు.  మన మతవిధులలో దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది.  నిష్ఠాపరులు దీనిని పగటి భోజనానికి ముందు నుదిటికి, చాతీకి, పై జబ్బలకిఉ రాచుకుంటారు.  నుదుటికి రాచుకోవడం తలలో వేడి చేరకుండా తలనొప్పి రాకుండా కాపుదలగా ఉంటుంది.  చాతీకి రాచుకోవడం వల్ల హృదయానికి మేలు చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
  జ్వర సంబంధమైన వేడి తగ్గడానికి రోగి కణతలకు ఉడుకులోనుకు బదులుగా మంచి గంధం రాస్తారు.
  వేసవిలో ఒళ్లు పేలకుండా ఉండడానికి గంధంపూత మంచిమందు.  అనేక ఫ్చర్మవ్యాధులకు, కీళ్ల వాపులకు, జుట్టురాలుటకు అది మంచి