ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏదో ఒకటి రావచ్చు. సాధారణంగా కృత్తిక అగ్ని సంబంధం కలది. రోహిణి కూడా కొంచెం ఇంచుమించు అటువంటిదే అని చప్పవచ్చు. అగ్ని సంబంధము వలన తీక్షణత కలుగుతుంది. అతీక్షణత తగ్గడానికి చందన చర్చ ఒకవిధమైన శైత్యోపచారము. సింహాచల స్వామికి విదియ నాటిరాత్రి గంధమును ఒలిచి వేస్తారు. తదియనాటి ఉదయాన సహస్ర ఘటాభీషేకము చేస్తారు. ఆ పిమ్మట స్వామినిజరూప దర్శనం. స్వామి రూపము లింగాకృతంలో కనిపిస్తుంది. పంది ముట్టి తరువాత విగ్రహరూపము కనిపిస్తుంది. ఆ రూపము ఇట్లు అభివర్ణితం "శ్రీస్వామి వారి విగ్రహాకారము అకృతాస్త్రుడయిన యొక శిల్పి చేమలచబడిన వరహావతారరూపము. క్షేత్రస్వామి వరాహాలక్ష్మీ నరసింహస్వామి, పందిముట్టి ఊరువులవరకు మాత్రమే కనిపించుకాళ్లు. శిఅస్తచ్చమయిన స్పటికము (విశాఖ పత్రిక 22-4-1936).

  నిజరూపదర్శనం అయాక తిరిగి స్వామికి చందన చర్చ, ఈ గంధం నలుపు సహస్రఘటాభిషేకం చందన సేవ మున్నగునవి.  సింహాచలము ఒకప్పుడు శైవక్షెత్రమై ఉండడాన్ని నిరూపిస్తూ ఉన్నాయి.  ఈ నిరూపణాన్ని క్రింది కారణాలు బలపరుస్తున్నాయి.
                    త్రినెత్రం
     "సింహాచలము ప్రధమమున శైవక్షేత్రముగ నుండినదనియు శ్రీరామనుజులవారి కాలములో కాబోలు నదివైష్ణవ దివ్యదేసమయినదనియు కొందల్రు చెప్పెదరు.
      (1) శివసంబంధము కలిగి యుండుటను బట్టియే ఆక్షేత్రదేవత యొక్క ధ్యానములోఫ్ 'త్రినేత్రం ' అనియు కలదు. వైష్ణవము పుచ్చుకొనిన తరవాత కూడ 'త్రినేత్రత్వము స్ధిరరముగ నిలిచినది '.         --సుబోధిని
     (2) ఈ దేవాలమునకు సోమసూత్రము కలదు.  ఇయ్యది అభిషేకాదులు తరుచుగా చేయబడు శివాలయము లందుండుట సాంప్రదాయము.
    (3) విష్ణు క్షేత్రములందు సహస్రఘటాభిషేకము చేయునాచారము లేదు.
   (4) ఇచ్చట కొండమీద కాలభైరవుడు, గంగాఅదార యుద్ద శ్రీ సీతారామస్వామి దేవాలయము కలదు.  కొండ దిగునను పూవులతోట