ఈ పుటను అచ్చుదిద్దలేదు
పర్వతాగ్రముననొక సలిల బిందువును జారవిడిచెను. బలరాముడు నాగలి పర్వతంబున నాటి ముందు నడువ నాతని వెంట పెద్దరొద నిడుచునురుగుగ్రమ్ముచు నొక మహాప్రవాహము రాజొచ్చెన్. శివుని ప్రసాదంబున బలరాముని నాగలి వెంట వచ్చు నీయేరు లాంగల్య యనబరగ జొచ్చెను. లాంగలి వెంబడి వచ్చిన కుల్యగావున లాంగుల్య యనునామ మద్దానికి సార్ధకమయ్యెను. నది పుట్టిన పర్వతాగ్రము నుండి తూర్పు సముద్రమున కలియునందాక తీరంబున బలరాముడు శివలింగము లైదింటిని బ్రతిష్ఠ చేసెను. పంచలింగ ప్రతిష్ఠతో నాతని పాపము తొలగెను.
ఈ నదిపై పాలకొండ, శ్రీకాకుళము అను ముఖ్య నగరములును, అనేక గ్రామములును గలవు. దీని నిడివి రెండు వందలమైళ్లు. బలరామునిచే బ్రతిష్ఠింపబదినవని నమ్మబదు చుండి8న శివాలయము లైదును సోమేశ్వరాలయము, భీమేశ్వరాలయము, సంగమేశ్వరాలయము, కోటీశ్వరాలయము, మణినాగేశ్వరాలయు - నేటికిని కొలది రాబడులతో రాగ భోగాదులందు చున్నవి. నది కిరుపార్శ్యముల కొంత మార్గము వరకుండు ప్రదేశమందలి జనులు సంకల్పమును జెప్పుకొనునపుడీ ప్రదేశమును బలరామక్షేత్రమని చెప్పుదురు. బలరామక్షేత్రమనునది శ్రీకాకుళము, చీపురుపల్లి తాలూకాలకు వైదికుఇలు వ్యవహరించునామంఊ. తూర్పు కనుమలందలి యొక పర్వతాగ్రమునకు బలరామగిగి యని వ్యవహారము.
గంగను భగీరధుడు, గోదావరిని గౌతముడు, నావావళిని బలరాముడు తపస్సు చేసి శంకరుని మెప్పించి భూలోకమునకు దెచ్చిరనుటలో నంతరార్ధము కలదు. తపస్సు చేయుటయనగా నరణ్యంఊణ నొంటరిగా గూర్చుండి ముక్కు మూసుకుని భగవద్ధ్యానము చేయుటయే కాదు. పర్వతోపరిభాగము నుండి ప్రవహించి చుండు సెలయేళ్లనెల్లనేకముచేసి నిమ్నోన్నతముల గనిపెట్టి సముద్రము వరకు మార్గము చూపుట సామాన్యమైన పనికాదు. గొప్పమేధాశక్తి నిర్మాణ, చాతుర్యము నుండిన గాని యట్టి పని నెరవేరదు. బలరాముడుకూడ నట్టి వాడనియే భావింపవలయును.
పైవిషయములను విమర్శింపగా నీప్రదేశమున బలరాముడు మత రాజకీయములందేకాక సాంఘిక జనోపయోగ నైతిక విషయములందు గూడ ప్రమేయము గలిగించుకొని యుండెననుట నిర్వివదాంశము."