ఈ పుటను అచ్చుదిద్దలేదు

బలరామకృష్ణులు

          భారతయుద్ధంలో ఆంధ్రులు కౌరవులపక్షాన ఉండిరి  బలరాముడు ఒకవిధముగా కౌరవ పక్షపాతి అనవచ్చును.  కృష్ణుడు పాండవ పక్షపాతి. కృష్ణుడు 'చాణూతాంద్రనిషూదండు ' కంసుని వద్ద ఉండిన చాణూరుడు అనె ఆంధ్రమల్లుని చంపినవాడు కృష్ణుడు.
    బలరాముని ఆయుధం నాగలి.  అతడు ఆ హలాయుధంతో కొన్ని అద్భుత కార్యాలు చేశాడు.
    దొర్యోధనుని కూతురైన లక్షమణను కృష్ణుని కుమారుడైన సాంబుడు వివాహార్దము తీసుకొనిపోతూ ఉండగా కౌరవసైనికులు అడ్దుకొని సాంబుని హస్తినాపురంలో చెరలో ఫేట్టారు.  సాంబుని విడిపించడానికి బలరాముడు వెళ్లాడు.  బలరాముడు ఎంతగా హెచ్చరించినా కౌరవులు సాంబుని విడవలేదు.  అప్పుడు బలరాముడు తననాగలితో హస్తినాపురాన్ని పెళ్లగించి వేయడానికి పూనుకున్నాడు.  అతని నాగలిపోటుతో హసినా పురమంతా అల్లల్లాడింది.  అప్పుడు కౌరవులు బలరామునికి దాసోహమ్మని సాంబుని విడిచిపెట్టేరు.
   నరకాసుర సంహారానంతరం నరకుని మిత్రుడు ద్వివిదుడనే వానరుడు పేట్రేగి పెద్ద పట్టణాలను, పెద్దతోటలను పచ్చము పాడుచేస్తూ ఉండినాడు.  రాళ్ళు రువ్వి వానిని పోద్రోలాలని బలరాముడు ప్రయత్నించాడు.  కాని కార్యం లేకపోయింది.  అప్పుడు బలరాముడు తనహలాయుధాన్ని వాది వానిని చంపివేశాడు.
    బలరాముడు దగాయుద్ధవిద్యలో దుర్యోదనునికి గురుడు. క్రుక్షేత్రంలో బీమదుర్యోదనుల గదాయుద్ధంలో బీముడు దుర్యోదనుని యూరువుల మీద కొట్టాడు.  అట్లా ఆధర్మం కాబట్టి భీముని శిక్షించడానికి బలరాముడు హలాన్ని ఎత్తాడు. కృష్ణుడు అడ్దుపది బలరాముని శాంత పరిచాడు.
     బలరాముడు ఒకసారి గోపికలతొ యమునానదికి స్నానానికి వెళ్లాడు.  ఆసందర్భంలో అతద్ యమునా నదిని పిలిచాడు.  కాని ఆమె రాలెదు.  అప్పుడు అతనికి కోపం వచ్చి యమునను చీల్చి వేస్తానని హలాన్ని గ్రుచ్చాడు. అందుతో భయఫడి యమున వెలరువారిన ముఖంతో స్త్రీరూపాన వచ్చి బలరాముడికి నమస్కరించి వినీల వస్త్ర్రాలు కానుకలుగా యిచ్చింది.