ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్చర్గ చింతామణిలో ఈనాదు మహాఫలవ్రతం, అనంతృతీయా వ్రతం చేస్తారని కలదు.

    ఈనాడు గంగాస్నానం, కౌశికీ స్నానం విశేషఫలప్రమైనది.
                            బలరామ జయంతి
   వైశాఖశుద్ధ తదియ బలరామ జయంతి. ఇట్లని మన పంచాంగాలు పేర్కొంటున్నాయి.  దక్షిణాదిని కొన్ని ప్రాంతాల్లో భాద్రపదశుద్ధ తదియనాడు బలరామ జయంతి జరుపుతారని తెలుస్తున్నది.
    బలరాముడు దేవకి ఏడవ గర్భమున అంతాంశమున పడగా యోగమాయ ఆగర్భమును ప్రసవింప చేసి రోహిణి కడుపున చేర్చిందనీ, భాద్రపద మాసం కృష్ణాష్టమినాడు రోహిణి నక్షత్రమున రోహిణి సంకర్షణుడు అనే పుత్రుని కన్నది అని పద్మపురాణము చెప్పుచున్నది.  కాని భాద్రపద కృష్టాష్టమిని స్మృతి కౌస్తుభము మున్నగు వ్రత గ్రందాలేవీ బలరామజయంతిగా పేర్కొవటంలేదు.  పురుషార్ధ చింతామణి మున్నగు గ్రంధాలు అక్షయ తృతీయను పరశురాముమ జయంతి9గా చెబుతున్నాయి.  కాని మన పంచాంగాలలో పరశురామ జయంతి మార్గశిరబహుళ విదియ;నాదు అని ఉంటున్నది.
    వ్రత గ్రంధాలలో వేఱొ తిధి పేర్కొన బడక పోవడంచేత మన పంచాంగాలు పేర్కొనడం చేత అక్షయ తృతీయనాడే బలరామ జయంతి అని నిర్ధారిద్దాము.
   రోహిణి యందు ఆదిశేషుడు బలరాముడుగ పుట్టాడని పురాణగాధ.  విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తినప్పుడు ఇతడున్నూ అవతారమెత్తాడు.  కృష్ణుని కంటె ఇతడె ఒకవిధముగా గొప్పవాడనే ధోరణి మాటలు క్షెమేంద్రకవి చారు చర్యలో కనిపిస్తున్నాయి.

     శ్లో: బన్దూనాం వారయే ద్వైర్ంనైక పక్షాత్రయోభవేత్
         కురుపాణ్ణవసజ్గ్రామే యుయుధెనహనహలాయుధ:

  తా.  బందువులలోని కలహములని నివారింపవలెను.  ఏకపక్షాశ్రయుడు కారాదు.  కురుపాండవ యుద్దంలో బలరాముడు యుద్ధం చేయలేదు.