ఈ పుటను అచ్చుదిద్దలేదు

వైశాఖము

 ఇది సంవత్సరములో రెండవమాసము.  వైశాంఅ మాసాన గృహనిర్మాణానికి ఆరంభించిన ధనరత్నప్రాప్తి అని మత్స్య పురాణం చెప్తోంది.

వైశాఖస్నానం ప్రాత:స్నానము చేసి, రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణాలు చేయాలి. తులసీదళములతో మాధవపూజ, పానకంబు దధ్యన్న మహుపదార్ధతతియు నుపహారమియ్యాలి.

వైశాఖ శుద్ధ పాడ్యమి

         వైశాఖ మాస స్నానవ్రతానికి ఇది ప్రారంభదినము.  వాజ్ఞన: కాయజాశేష్ పాపాలు వైశాఖ స్నానంతో పోతాయి.  ప్రాత:కాలంలో నియమంగా స్నానం చేస్తే మాధవునకు ప్రీతికలుగుతుంది.  స్నానానంతరము రావి చెట్టుకు నీరుపోసి ప్రదక్షిణాలు చేయడం ఆరోగ్యకరము.  ఈ మాసములో తులసి దళాలతో మాధవుడికి పూజ చేస్తే పుణ్య్హము కలుగుతుంది.

వైశాఖ శుక్ల తదియ

అక్షయ తృతీయ

   వైశాఖ శుక్ల తృతీయ అక్షయ తృతీయ అనీ, ఈ పర్వం పూర్వాహ్ణా వ్యాపిని అనీ వ్రతరాజము చెబుతూ ఉంది.  అక్షయ తృతీయ గొప్ప పుణ్యదినం.
    అక్షయ తదియ సోమవారమునాడుకాని, బుధవారమునాడుకాని అయితే మరీ పవిత్రమైనది.   కృత్తిక రోహిణీ నక్షత్రముతో కూడిన ఈ పర్వం అతిప్రశస్తం.
    "వైశాఖే మాసి రాజేంధశుక్ల అక్షే తృతీయకా,  అక్షయాసాతిధి: ప్రొక్తా కృత్తికా రోహిణియుతా" అని శాస్త్ర ప్రమాణము.
 ఈనాడు చేసే దానాలు అక్షయ ఫలాన్ని ఇస్తాయి అనీ చెబుతారు.  దానాలేకాదు ఈనాడు దేవతలను గుఱించి, పితృదేవతలను గుఱించి చేసే పూజలు కూడా అక్షయ ఫలాన్ని ఇస్తాయి.  అందుచేతనే దీనికి అక్షయ